విరామం ఎరుగని ఉద్యమ కారుడిగా.. అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుడిగా.. “అనంత” ప్రజల దేవుడిగా, “రాయలసీమ”ప్రజల గుండెల్లో రారాజుగా కొలువుదీరిన “పరిటాల రవీంద్ర” గారి జయంతి సందర్భంగా నేడు 30 సోమవారం, ఆగస్టు 2021 న మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్ర(రవి) గారి 63వ జయంతి సందర్భంగా తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయం కోసం NTR ట్రస్ట్ సహకారంతో, పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ నివాసంలో 29 ఆదివారం మహా రక్తదాన శిబిరం జరిగినది. పెద్ద ఎత్తున అభిమానులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ముందుగా పరిటాల రవీంద్ర, వడ్లమూడి కృష్ణరావు గారి చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. తుది శ్వాస వరకూ పేద ప్రజల కోసం అండగా నిలిచారు. వారి ఆశయాల కోసం మేమంతా నిరంతరం కృషి చేస్తామన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని మొదలుపెట్టారు. 200 పైగా రక్తం బాగ్స్ సేకరించడం జరిగినది. రక్తదాతలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సర్టిఫికెట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో కుమారుడు సిధార్ధ, కుమార్తె స్నేహాలత, అల్లుడు శ్రీహర్ష మరియు పరిటాల కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.
మహా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు..