ఆశ్రమ పాఠశాలకు ప్రవాసాంధ్ర దంపతుల ఆపన్నహస్తం

హయత్‌నగర్ తుర్కయంజాల్ మున్సిపాలిటిలోని మునుగునూరూలోగల సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఆశ్రమ పాఠశాలకు ప్రవాసాంధ్రుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్, ఆయన సతీమణి, క్యూ హబ్ సీఈఓ ప్రియాంక నిత్యావసర సరుకులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. బాలికల కోసం ఆశ్రమం నిర్వహిస్తున్న వేమూరి విజయలక్ష్మిని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక తరగతిని దత్తత తీసుకుని నిర్వహణకు అయ్యే ఖర్చును భరిస్తామని వారు హామీ ఇచ్చారు. విద్యార్థినులు అందరూ బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా 30మంది విద్యార్థినులకు రూ.5లక్షల ఉపకారవేతనాలను అందించారు. అంతేకాకుండా 50మంది విద్యార్థినుల కుటుంబాలకు కూడా నిత్యావసరాలను అందజేశారు.

Share: