డాక్టర్ చిగురుపాటి వేద సంహిత.. తెలంగాణలో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరేందుకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారు వేదసంహిత. ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఒకటైన ట్రామా సర్జరీ కోర్సుల్లో ఈ ర్యాంకు దక్కింది. ఓ ప్రణాళిక ప్రకారం చదవడం వల్లే తనకు ఈ ర్యాంకు సాధ్యమైందని వేద సంహిత పేర్కొన్నారు.
డాక్టర్ చిగురుపాటి వేద సంహితది నిజామాబాద్ జిల్లాలోని బోధన్. వెంకటేశ్వరరావు, శశిరేఖ దంపతులకు 1994లో జన్మించారు. వెంకటేశ్వరరావు స్కూలు టీచరు. స్థానిక విజయా మేరీ హై స్కూలులో పదో తరగతి వరకు చదువుకున్న వేద సంహిత హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 2009-11లో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఎంసెట్ రాసి 141వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఉస్మానియా వైద్య కశాశాలలో ఎంబీబీఎస్‌లో చేరి మంచి ర్యాంకుతో పాసయ్యారు. ప్రస్తుతం బెనారస్ విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో జూనియర్ రెసిడెంట్ (పీజీ) ఫైనల్ ఇయర్ చేస్తూనే ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంకు సాధించారు. వేద సంహిత సోదరుడు వేదవ్యాస్ అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ‘కమ్మ వైభవం’ కోరుకుంటోంది.
ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా టాపర్ డాక్టర్ చిగురుపాటి వేదసంహిత
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021