యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఈషా ఉప్పలపాటి

Isha-Uppalapati-Founder-A-Girl’s-Frontier

ఈషా ఉప్పలపాటి.. పరిచయం అక్కర్లేని పేరిది. మహిళా సాధికారతపై 12వ తరగతిలోనే పుస్తకం రాసి సంచలనం సృష్టించిన

ఈషా తాజాగా మరో ఘనత సాధించింది. అమెరికా ప్రభుత్వం ఆమెను ‘యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్స్’లో ఒకరిగా గుర్తించి

గౌరవించింది. ఇది ఆమె ఒక్కరికే దక్కిన గౌరవం కాదు.. అమెరికాలోని తెలుగువారికే కాక, భారతదేశానికి, తెలుగు గడ్డకు

దక్కిన గౌరవంగా భావించవచ్చు. యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఎంపికైన ఈషాను అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు కలిసి అభినందించారు.

 

జార్జియాలోని వాల్టన్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తిచేసిన ఈషా ప్రఖ్యాత డ్యూక్ యూనివర్సిటీలోని బిజినెస్ స్కూల్‌లో చేరింది. ఓ వైపు చదువులో అగ్రగామిగా ఉంటూనే బాలికా విద్యకు పాటుపడుతోంది. మహిళా సాధికారతపై పిన్న వయసులోనే ఓ పుస్తకాన్ని రాసింది. ఇటీవల

విడుదలైన ఆ పుస్తకం పేరు  Her Toolbox: Learning to be a Female Leader with Advice from Women in Power

(‘హెర్ టూల్‌బాక్స్: లెర్నింగ్ టు బి ఎ ఫిమేల్ లీడర్ విత్ అడ్వైజ్ ఫ్రమ్ విమెన్ ఇన్ పవర్).

 

చదువులో ఎంతో ప్రజ్ఞాశాలి అయిన ఈషా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ‘ట్రయాంగిల్ బిజినెస్ జర్నల్ వరల్డ్ అవార్డ్స్’

నుంచి  ‘విమెన్ వరల్డ్ యాన్యువల్’ అవార్డులు అందుకుంది. ఇందులో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం ఉన్నాయి.

‘ఎ గర్ల్’స్ ఫ్రాంటియర్’ను స్థాపించి అమ్మాయిలను ‘యంగ్ లీడర్స్‌’ గా తీర్చిదిద్దేందుకు సాయం చేస్తున్నందుకు గాను బంగారు

పతకం, పేదల విద్యార్థుల చదువుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి గాను బంగారు పతకం, ‘ఎ గర్ల్’స్

ఫ్రాంటియర్’ను స్థాపించినందుకు గాను రజత పతకం కైవసం చేసుకుంది. ఈషా చదువులో ఎంత చురుగ్గా ఉంటుందో సామాజిక

సేవలోనూ, దాతృత్వంలోనూ అంతే చురుగ్గా ఉంటుంది. ఎనిమిదో తరగతిలో ఉండగానే ‘ఎ గర్ల్’స్ ఫ్రాంటియర్ (A Girl’s

Frontier) పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించింది.

 

ఈషా తల్లిదండ్రులు ఉప్పలపాటి సుహాస్- డాక్టర్ మధురిమ. వీరి కుటుంబం అమెరికాలోని

అట్లాంటాలో స్థిరపడింది. సుహాస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఆల్‌స్టేట్ ఇన్సూరెన్స్ బిజినెస్, మారియెట్టాలో హెమ్మింగ్‌వే రెస్టారెంట్,

అమెరిప్రో ఈఎంఎస్(ఎమెర్జెన్సీ మెడికల్ సర్వీసెస్) సీఈవోగా ఉన్నారు. డాక్టర్ మధురిమ ఆంకాలజిస్ట్. నార్త్‌వెస్ట్ జార్జియా

ఆంకాలజీ సెంటర్స్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సుహాస్ తల్లిదండ్రులు ఉప్పలపాటి సుబ్బారావు-ఝాన్సీరాణి. సుబ్బరావు డాక్టర్

బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెకర్ట్‌గా పనిచేస్తూ రిటైరయ్యారు

Share: