రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య
దుమ్మెత్తి పోసుకోవడం, శ్రుతి మించి తిట్టుకోవడం, అందినంత దోచుకోవడం.. ఇవీ నేటి రాజకీయాల తీరు. ప్రజాసేవకు నేరుగా ఉన్న ఈ గొప్ప మార్గం ఎలా దుర్వినియోగం అవుతున్నదీ
తెలంగాణ అభ్యుదయవాది చేకూరి కాశయ్య కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత చేకూరి కాశయ్య మే 25న అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ అభ్యుదయవాదిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఆయన మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. నిస్వార్థ రాజకీయ నేతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మరణంతో నిజాయితీ కలిగిన సీనియర్ రాజనీతిజ్ఞుడిని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. చేకూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ స్నేహశీలి కాశయ్య మృతి తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. కాశయ్య గొప్ప మానవతావాదని, అందరి వాడిగా గుర్తింపు పొందారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ నేత, మాజీమంత్రి విజయరామారావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాశయ్య అందరివాడిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021