విజయ రహస్యం ఏమిటీ?

narasimhaerao

అన్ని అవకాశాూ ఉండి, అన్ని అర్హతు వున్నవారిలో కొందరు అపూర్వ విజయాు సాధించుతుంటే, మరి కొందరు మామూుగా ఎందుకు మిగిలిపోతుంటారు? అందరినీ సతమతం చేసే ప్రశ్న ఇది.
ఎవరైనా, ఏ విజయాన్నైనా చేపట్టడానికి దోహదం చేసే ముఖ్యమైన అంశాు ఏమిటి? ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాని, ఉన్నత స్థాయికి చేరుకోవాని కోరుకుంటూనే వుంటారు. పరిమితస్థాయిలో అశించేవారు, ఆ స్థాయిలోనే మిగిలిపోతుంటారు. ఒక చిన్న రైతు తన కున్న గేదెతో పాటు మరో రెండు గేదెను కొనుక్కోవాని, లేదా తనకున్న పూరిగుడిసె స్థానంలో మంచి ఇు్ల కట్టుకోవాని, లేదా తన కూతురికి ఒక ప్రభుత్వ ఉద్యోగితో వివాహం చేయాని కోరుకుంటాడు. అతని జీవనస్థితిలో పెద్దగా మార్పు రాదు. అతి చిన్న క్ష్యాను ఎంచుకొని తమ జీవితకామంతా వాటిని సాధించడానికి తిప్పు పడేవారిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, అన్ని అవకాశాూ ఉండి, అన్ని అర్హతు వున్నవారిలో కొందరు అపూర్వ విజయాు సాధించుతుంటే, మరి కొందరు మామూుగా ఎందుకు మిగిలిపోతుంటారు? అందరినీ సతమతం చేసే ప్రశ్న ఇది.
కుటుంబరావు ఒక పట్టణంలో ప్రముఖ న్యాయవాది, చాలా
ఉత్తముడు. అతనికి ఇద్దరు కుమాయి. ఇద్దరినీ అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి ఈయన అన్ని ప్రయత్నాూ చేసేవాడు. పెద్దకొడుకు మధు పాఠశాలోను, కాలేజీలోనూ ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచేవాడు. అతను అమిత ప్రతిభావంతుడని అందరూ అభినందించేవారు. అతను ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలో క్యాంపస్‌ ఇంటర్యూలో ఒక ప్రసిద్ధ కంపెనీలో మంచి ఉద్యోగం పొందాడు. ఇక రెండవ కుమారుడు మురళి చాలా తెలివైనవాడని చిన్నతనం నుండి అందరూ వ్యాఖ్యానించేవారు. కానీ, అతను ప్రతి పరీక్షలో అత్తెసరు మార్కుతో పాసయ్యేవాడు. అతనికి సినిమా పట్ల అమిత ఆసక్తి వుండేది. అలాగే, ఎప్పడూ ఇంటర్నెట్‌కు అంటిపెట్టుకు వుండేవాడు. పైగా ఏం చదువుతావని తండ్రి అడిగితే, వైద్యవిద్య అభ్యసించాన్నది తన జీవితకాంక్ష అని చెప్పేవాడు. మురళి ఆలోచను వాస్తవిక ధోరణిలో లేవని తండ్రి విసుక్కునేవాడు. ‘‘గతంలో వచ్చిన, ఇప్పుడు వస్తున్న మార్కుల్ని పరిశీలించితే నీకు సీటు రావడం అసాధ్యం. పైగా డొనేషన్‌ కట్టి చదివించడానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ, ఇప్పుడు చదువుతున్న రీతిలోనే చదివితే మెడిసిన్‌ పూర్తి చేయడానికి చాలా కాం పడుతుంది. పూర్తి చేసిన తర్వాత కూడా భవిష్యత్తులో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వుంటుంది.’’ అని తండ్రి అనేకసార్లు చెప్పాడు. చివరకు మురళి ఆ ఆలోచన విరమించుకొని ఇంజనీరింగ్‌లోనే చేరాడు. అందులో కూడా రెండు సబ్జెక్టు మిగిలిపోతే, వాటిని పూర్తిచేసి ఇంజనీరింగ్‌ పూర్తయిందనిపించుకున్నాడు.
మురళిని చూసి కుటుంబరావు ఎప్పడూ వేదన చెందుతుంటేవాడు. ఇతను బ్రతకడానికి తాను సంపాదించిన ఆస్తి చాు. కాని, వాడి జీవితమంతా వృధాగా మిగిలిపోవాల్సిందేనా అని చింతించేవాడు. పైగా అతనికి జీవితంలో ఎలా స్థిరపడాన్న ఆలోచనే లేదన్న భావన కుటుంబరావుని మరింత క్రుంగదీసేది. పైగా మురళితో అన్ని విషయాూ చర్చించుదామంటే అతనెప్పుడూ తీరికగా దొరికేవాడు. కాదు. అతనికి లెక్కలేనంత మంది స్నేహితు, ఎప్పుడూ వాళ్లతో చర్చల్లో, కాక్షేపాల్లో మునిగి వుండేవాడు. ఇంటి వద్ద ఉంటే కంప్యూటర్‌ ఎదురుగా కూర్చుని వుండేవాడు. ‘‘మురళీ! నువ్వేం చేద్దామనుకుంటున్నా’వని తల్లి గాని, తండ్రిగానీ ప్రశ్నించితే ‘ఏం చేయమంటారో చెప్పండి..’ అని ఎదురు ప్రశ్నించేవాడు. దానితో వారేమో సమాధానం చెప్పలేకపోయేవారు. వున్నట్లుండి ఒకరోజు మురళి తాను అమెరికా వెళతానన్నాడు. ఓ పది రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాడు. తండ్రి వెంటనే అంగీకరించి అతను కోరినంత డబ్బును అతని అకౌంట్‌లో జమచేశాడు. మరో దేశం వెళ్లి అక్కడి పరిస్థితును గమనించి వచ్చాకయినా అతని ఆలోచనా ధోరణిలో, ప్రవర్తనలో ఆహ్వానించదగిన మార్పేదయినా వస్తుందేమోనని ఆయన ఆశించాడు.
తన ప్రతిభా సామర్థ్యాన్నింటినీ తన చదువుపైకి మళ్ళించలేనని గుర్తించగానే తాను ఏదైనా పరిశ్రమను స్థాపించాని మురళి భావించాడు. తనకు అనువైన పరిశ్రమ ఏదన్నదే గత రెండు మూడు సంవత్సరాుగా అతను అన్వేషిస్తున్నాడు. ఈ సందర్భంలోనే అతను అనేక మంది పారిశ్రామికవేత్తను కలిశాడు. అయా పరిశ్రమను సందర్శించాడు. చివరకు మందు తయారు చేసే ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమ తనకు అనువైనదని అతను భావించాడు. కాని అందులో తీవ్రమైన పోటీ వుంది. క్రొత్తగా అందులో ప్రవేశించేవారు నెగ్గుకు రావడం సాధ్యంకాదని కూడా అతను గుర్తించాడు. అందుకే ఎవరూ ఉత్పత్తి చేయని, పెద్దగా పోటీలేని ఉత్పత్తి కోసం ఇంతకాంగా తన అన్వేషణను కొనసాగించాడు. చివరకు తాను కోరింది భించింది. తీవ్రమైన నొప్పి, బాధ నుండి ఉపశమనం అందించే పట్టీని తయారుచేసే పరిశ్రము నాుగు మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, భారతదేశంలో వారి సహకారంతో అటువంటి పరిశ్రమ నెక్పొడానికి వారి అనుమతి పొందాడు.
తిరిగి రాగానే మూపడి ఉన్న పరిశ్రమను లీజుకు తీసుకుని తన ఉత్పత్తిని ప్రారంభించాడు. తన ఉత్పత్తు పంపిణీని అతి ప్రసిద్ధ సంస్థకు అప్పగించాడు. ఇక ఉన్నట్లుండి దాని డిమాండ్‌ను తట్టుకోవడానికై ఇతను తన పరిశ్రమను ఇరవైనాుగు గంటూ పని చేయించాల్సి వచ్చింది. అనేక దేశా నుంచి ఆర్డర్లు రాసాగాయి. కలో కూడా ఊహించనంతటి లాభాు వచ్చి పడసాగాయి. ఈ పరిణామం చూసిన కుటుంబరావుకు నోట మాటరాలేదు.
ఇద్దరు కొడుకునూ తాను ఒకే రకంగా పెంచాడు. ఇద్దరికీ అన్ని అవకాశాూ కల్పించాడు. ఇద్దరికీ తమ ఇంట్లో ప్రత్యేక గదు, ఇంజనీరింగులో చేరేసరికి ఇద్దరికీ కార్లు సమకూర్చాడు. పట్టణంలోని ప్రముఖందరితోనూ ఇద్దరికీ పరిచయాు ఏర్పడ్డాయి. ఇద్దరూ తమ జీవితంలో ఇబ్బంది పడిన సన్నివేశమే లేదు. అయినా మధు తన జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. మురళి ఎందుకూ కొరగాకుండా పోయాడు. అని కటుంబరావు ఇంతవరకూ విచారించేవాడు. అప్పడు మురళి ఎవరి సహాయ సహకారాు లేకుండా కేవం ఒక సంవత్సరం వ్యవధిలో దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు. పెద్ద ఉద్యోగంలో చేరి జీవితకామంతా కష్టపడి సంపాదించలేనంతటి ఆదాయాన్ని ఒక సంవత్సర కాంలో సంపాదిస్తున్నాడు. ఈ రహస్యం ఎక్కడ వుంది. మధు తన తండ్రి కోరిన రీతిలో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. మురళి తన జీవన గమనాన్ని తానే స్వంతంగా ఎంచుకున్నాడు. అసలైన విజయరహస్యం ఇదే!

Share: