సామాజిక సేవలో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్

IKY

హనుమాన్ జంక్షన్ :

ఆపదలో ఉన్న రోగులకు విశేష సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సానిటైజర్స్ , మాస్కులు, గ్లవజులు అందచేశారు. హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్డు లో జరిగిన కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు పరుచూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆరు N95 మాస్కులు
మూడు లీటర్లు శానిటైజర్( 6X 500), వంద హ్యాండ్ గ్లౌజులను 108 సిబ్బంది సురేష్ కు అందచేశారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో రోగులను వైద్యశాలలకు తరలించే 108 సిబ్బంది జాగ్రత తో ఉండాలని సమితి నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, అట్లూరి రాజశేఖర్ .కంభంపాటి నాగేంద్ర వీరమాచినేని రవికుమార్ పాల్గొన్నారు ఇదిలా ఉండగా కరోనా లక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మచిలీపట్నానికి చెందిన కోటా రామకృష్ణ కి రూ.1200, విశాఖపట్నానికి చెందిన మాగంటి దన వెంకట రాంప్రసాద్ కు రూ.5000 రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన సుంకవల్లి వరలక్ష్మీకి 8000 రూపాయలు , హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ లకు(హనుమాన్ జంక్షన్, వీరవల్లి,ఆగిరిపల్లి)బాపులపాడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ; వాటర్ వర్క్స్ సిబ్బందికి, మొదలు హనుమాన్ జంక్షన్ ప్రింట్ మీడియా విలేకర్లకు 200 ఫేస్ ఫీల్డ్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది (8000 విలువ గల) హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో నిరుపేద వలస కూలీలకు 8000 విలువగల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.గుంటూరు జిల్లా చిన లింగాయ పాలెం గ్రామములో వలస కూలీలకు 10000 విలువగల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది,విజయవాడలో పరుచూరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 600 మాస్కులు వెయ్యి మజ్జిగ పాకెట్లు పంపిణీ చేయడం జరిగింది..విజయవాడలో పరుచూరి మధుకిరణ్ గారి ఆధ్వర్యంలో 200 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది కృష్ణా జిల్లా తిరువూరులో లింగం వెంకట గోపినాథ్ గారి ఆధ్వర్యంలో వలస కూలీలకు భోజనం ప్యాకెట్ లు హనుమాన్ జంక్షన్ రైతు బజార్ లో 100 మాస్కులు 200 హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేయడం జరిగింది
కమ్మవారి ఐక్యసేవా సమితి నుండి ఆర్థిక సాయం అందించినట్లు ఈ సందర్భంగా పరుచూరి తెలిపారు.

Share: