June 23, 2021

am

అమర రాజా లాభం రూ.189 కోట్లు

అమర రాజా బ్యాటరీస్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం ఏకంగా 36 శాతం వృద్ధి చెంది రూ.189 కోట్లుగా నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ.137 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,581 కోట్ల నుంచి రూ.2,103 కోట్లకు పెరిగింది. మార్చి త్రైమాసికంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అన్ని వ్యాపార విభాగాల్లో అమ్మకాలు […]

అమర రాజా లాభం రూ.189 కోట్లు Read More »

G1

ఈ- గేమ్స్‌ ఆడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్! వీటితో ఆరోగ్య సమస్యలే

మెడ, వెన్ను నొప్పులతో ఇబ్బంది పడుతున్న నవతరం రోజుకు 5-6 గంటలు నిమగ్నం కావడమే కారణం : డాక్టర్లు ఆన్‌లైన్‌లో గేమింగ్‌ పోటీలు కూడా.. ఒంటికి వ్యాయామాలు చాలా మంచిది. క్రీడలతో చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చాలామంది చెబుతారు. ఆరు బయట ఆడుకుంటున్నప్పుడు తమకు ఫలానా చోట గాయమైందని, అయినాసరే, తనకు ఇప్పటికీ ఆ ఆటలు ఆడటం ఇష్టమని చెబుతుండడం సర్వ సాధారణంగా చూస్తుంటాం. ఇప్పటి నవతరం కూడా ఆటలు ఆడుతుంది. కానీ మునపటిలా కాదు.

ఈ- గేమ్స్‌ ఆడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్! వీటితో ఆరోగ్య సమస్యలే Read More »

ntr krishna

యన్టీఆర్ మరో పేరు ‘ట్రెండ్ సెట్టర్’!

ఈ మధ్య పలువురు దర్శకనిర్మాతలు తమ చిత్రాల గొప్పలు చెప్పుకుంటూ సరికొత్త పంథాకు నాంది పలికాం అంటూ చాటింపు వేసుకుంటున్నారు. ఇక తమ సినిమా ‘ట్రెండ్ సెట్టర్’గా నిలచిందనీ ప్రకటించు కుంటున్నారు. చివరకు చూస్తే, సదరు చిత్రాలు ఎక్కడో కొట్టుకు వచ్చిన కథలతో తెరకెక్కినవని తేలిపోతోంది. అలా డబ్బా కొట్టుకున్నవారు నవ్వుల పాలవుతున్నారు. ట్రెండ్ అన్నది ఒకరు నెలకొల్పిన దానిని మరికొంతమంది అనుకరిస్తే మొదలవుతుంది. అంతే తప్ప, అదే పనిగా ట్రెండ్ సెట్టర్స్ మేమే అంటూ డంభాలు

యన్టీఆర్ మరో పేరు ‘ట్రెండ్ సెట్టర్’! Read More »

raju

ఆడలేక…చంద్రబాబుపై… అక్కసు!

“ఇంట్లో పోరు తాలలేనివాడు. బయటివాళ్ళపై రంకేలు వేశాడంట”- ఇదో పాత సామెత! అయితే ఈ సామెత ఇప్పటికీ వాస్తవంగా మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ సామెతను ఈ నాటికీ నిజం చేయడంలో చరిత్ర సృష్టించారు. తన సొంత పార్టీ ఎంపీ, నరసాపూర్ లోక్ సభ్య ప్రతినిధి అయిన కనుమూరి రఘురామ కృష్ణంరాజుతో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఏ కారణంగా కలహం రేగిందో కరెక్టుగా ఎవరూ చెప్పలేరు. కానీ, జగన్ పై

ఆడలేక…చంద్రబాబుపై… అక్కసు! Read More »

rrr

ఆర్.ఆర్.ఆర్.’లో యంగ్ టైగర్ ఫైట్స్!

జూనియర్ యన్టీఆర్ గా జనం మదిలో నిలచిన బుల్లి రామయ్య అంటే అభిమానులకే కాదు చిత్రసీమలోనూ ఎంతోమందికి ప్రేమ, అభిమానం ఉన్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత, దర్శకుడు అయిన విజయేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. విజయేంద్రప్రసాద్ రచనతో జూనియర్ యన్టీఆర్ కెరీర్ కు విడదీయరాని బంధం ఉంది. జూనియర్ యన్టీఆర్ కెరీర్ లో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు సృష్టించిన ‘సింహాద్రి’ చిత్రానికి ఆయనే రచయిత. ఇక తాతను గుర్తుకు చేసేలా జూనియర్ నటించిన

ఆర్.ఆర్.ఆర్.’లో యంగ్ టైగర్ ఫైట్స్! Read More »

ramudu1

రాముడంటే రామారావే!

యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం

రాముడంటే రామారావే! Read More »

ntr12

సంక్షేమంలో స్వర్ణయుగం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ఎన్.టి. రామారావు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. మూడు సార్లు తన రికార్డును తానే అధిగమించి ప్రతి సారీ మూడొంతుల మెజారిటీతో గెలిచి, కేవలం ఏడున్నర సంవత్సరాలు మాత్రమే పాలించిన నాయకుడు ఎన్టీఆర్. ప్రజాకర్షణలో శ్రీమతి ఇందిరాగాంధీ తరువాత ఆయనదే ద్వితీయ స్థానం. రామారావు సంప్రదాయక రాజకీయ నాయకుడు కాదు. కుళ్ళు, కుతంత్రం తెలియని ఏకైక రాజకీయ నాయకుడుగా ఆయన చరిత్రకెక్కారు. అధికారానికి వచ్చినప్పుడు పరిపాలనానుభవం శూన్యం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన పాలనా కాలమే

సంక్షేమంలో స్వర్ణయుగం Read More »

prf

మిజోరం యూనివర్సిటీని మరోస్థాయికి తీసుకెళ్తున్న ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు

గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ క్రొత్తపల్లి రాజసూర్య సాంబశివరావు వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న మిజోరం యూనివర్సిటీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ తాజాగా విడుదల చేసిన ‘ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2021’లో మిజోరం యూనివర్సిటీకి ప్రపంచస్థాయిలో 601-800 ర్యాంకు లభించింది. దేశంలోని మొత్తం 49 యూనివర్సిటీలకు ఈ ర్యాంకింగ్స్‌లో స్థానం లభించగా, మిజోరం వర్సిటీకి 21వ స్థానం లభించడం విశేషం. అంతేకాదు, ఈశాన్య భారతదేశంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

మిజోరం యూనివర్సిటీని మరోస్థాయికి తీసుకెళ్తున్న ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు Read More »

G

ఐదు రూపాయలు వసూలైతే కానీ భోజనం చేయనని భీష్మించుకున్నాం – గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చక్కని స్ఫూర్తికాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం. చెరుకువాడ వెంకట నరసింహంగారి మాతామహు స్థానం మా

ఐదు రూపాయలు వసూలైతే కానీ భోజనం చేయనని భీష్మించుకున్నాం – గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »