78 ఏళ్ళ వయసులో దర్శకేంద్రుడి తెరంగేట్రం!

r

‘ముసలి ముప్పున తొలి సందడి’ అన్నట్టు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన 78 ఏళ్ళ వయసులో తొలిసారి నటనలో అడుగుపెడుతున్నారు. దర్శకునిగా రాఘవేంద్రరావుకు ఉన్నంత సక్సెస్ రేట్ మరే తెలుగు దర్శకునికీ లేదంటే అతిశయోక్తి కాదు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించగా, వాటిలో దాదాపు 60 చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద విశేషంగా సందడి చేసినవే. మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ తో పాటు తరువాతి తరం హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి – ఇలా అన్ని తరాల టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ పనిచేసిన దర్శకునిగా రాఘవేంద్రరావు ఒక్కరికే పేరుంది. ఆయన చిత్రాల ద్వారా నటనతో ఆకట్టుకొని అవార్డులు, రివార్డులు సంపాదించిన వారెందరో ఉన్నారు. అయితే రాఘవేంద్రరావు ఏ నాడూ తెరపైకి వచ్చి కనిపించింది లేదు. ఆ మాటకొస్తే ఆయన సక్సెస్ రూటులో సాగుతున్నన్ని రోజులు మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనను చాలామంది ‘మౌని’ అనేవారు. ఈ మధ్యే తన చిత్రాల పూర్వపరాలను నవతరం ప్రేక్షకులకు వివరిస్తూ యూ ట్యూబ్ లో కొన్ని వీడియోస్ పెడుతున్నారు. అలాంటి కె.రాఘవేంద్రరావు ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు నటునిగా నటించబోవడం నిజంగా విశేషమే!మహానగర ఎన్నికల్లో మహానాయకుల పేర్లతో రచ్చ
మహానాయకులను మననం చేసుకోవడం, వారి గొప్పదనాన్ని స్మరించుకోవడం రాజకీయాల్లో పరిపాటి. వారు ఏ పార్టీలకు చెందినవారయినా, గతించిన తరువాత వారిని గౌరవంగా చూడటమూ సత్ సంప్రదాయమే. ఇక కొందరు రాజకీయనాయకులు నేరచరితులైనప్పుడు వారు గతించిన తరువాత కూడా వారి తప్పిదాలను ఎత్తి చూపించడమూ మామూలే. కానీ, మనం పుట్టిపెరిగిన నేలకు గౌరవప్రతిష్ఠలు తీసుకు వచ్చిన మహానాయకులను, వారి జ్ఞాపకాలను తూలనాడడం ఏ పార్టీవారికీ శ్రేయస్కరం కాదు. కేవల రాజకీయ లబ్ధికోసం మహానాయకులను, వారి జ్ఞాపకాలను తూలనాడితే అలాంటి వారు చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని రాజకీయాల్లో ఉన్నవారు, అందులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశించేవారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2020లో జరుగుతోన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల్లో కొందరు కుచ్ఛితపు మనస్కులు తెలుగునేలకు కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టినవారిని కించపరిచేలా వ్యాఖ్యానించడం గర్హనీయం. మొట్టమొదటి దక్షిణాది ప్రధానిగా నిలచిన పి.వి.నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమ కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా కీర్తినొందిన యన్.టి.రామారావు – వారి జ్ఞాపకార్థం వెలిసిన నందనవనాలను కూల్చివేస్తామని ఎమ్.ఐ.ఎమ్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను సర్వత్రా ఖండిస్తున్నారు.

రాజకీయ లబ్ధికోసమే…

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో తమ స్థానాలను పదిలం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నిస్తే, ఎప్పుడూ తమ పట్టున్న స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తో్న్న ఎమ్.ఐ. ఎమ్. కూడా అదే తీరున సాగింది. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ మునుపెన్నడూ లేని ఉత్సాహంతో నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఇక ఒకప్పుడు గ్రేటర్ లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్, టీడీపీలు రెండూ తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఊపును చూసిన వాళ్ళు ముఖ్యంగా ఎమ్.ఐ.ఎమ్. తమ బలాన్ని ఏ మాత్రం కోల్పోరాదనే కృతనిశ్చయంతో కుహనా రాజకీయాలకు తెరతీసింది. అందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీ మహానాయకులు యన్టీఆర్, పీవీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. అందుకు బీజేపీ నాయకుడు బండి సంజయ్ వెంటనే స్పందించారు. మహానాయకుల జ్ఞాపకార్థం వెలసిన నందనవనాలను తొలగించి చూడమని, అదే జరిగితే రెండు గంటల్లోనే దారుసలామ్ ను కూల్చివేస్తామని ప్రతి సవాల్ విసిరారు. దాంతో హైదరాబాద్ మహానగరంలోని ఎందరో యన్టీఆర్, పీవీ అభిమానులకు బీజేపీపై సానుభూతి కలిగింది. అదీగాక యన్టీఆర్ కు ‘భారతరత్న’ ఇవ్వాలని అందుకు బీజేపీ తరపున తాము కృషి చేస్తామనీ బండి సంజయ్ ప్రకటించడం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది.
ఇక అక్బరుద్దీన్ లొల్లి ఏంటంటే, ఒకప్పుడు హుసేన్ సాగర్ 4700 ఎకరాలు ఉండేదని, అది ప్రస్తుతం 700 ఎకరాలకే పరిమితయిందని, అందుకు సాగర్ కు చెరోవైపు వెలసిన యన్టీఆర్, పీవీ ఘాట్లు కారణమని అతని అభిప్రాయం. నిజానికి, అతను చెబుతున్నట్టుగా సాగర్ ను ఈ రెండు ఘాట్లు ఏమీ ఆక్రమించలేదు. అంతకు ముందే ఆక్రమితమై, భూభాగంగా ఏర్పడిన ప్రాంతాల్లోనే యన్టీఆర్, పీవీ ఘాట్లు వెలిశాయి. అదీగాక, వారి ఘాట్ల నిర్మాణం దిశగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సమయంలో అక్బర్ పార్టీకి చెందిన వారు అసెంబ్లీలో సభ్యులుగానూ ఉన్నారు. అంతెందుకు స్వయానా అతని అన్న అహ్మదుద్దీన్ ఒవైసీ కూడా అప్పట్లో శాసనసభ్యునిగా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం ఘాట్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకున్న సమయంలోనూ ఎమ్.ఐ.ఎమ్. పార్టీ నాయకులెవరూ అభ్యంతరం చెప్పలేదు. మరి అక్బర్ ఎన్నికల సమయంలో అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అన్ని పార్టీల వారూ ఖండించారు. అయితే మహానాయకులు పీవీ, యన్టీఆర్ కు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిదానంగా స్పందించడం ఎంతోమందిని ఆశ్చర్య పరచింది. ఇక పీవీ వారసులు కానీ, యన్టీఆర్ వారసులు కానీ, ఈ విషయంలో ఏ మాత్రం స్పందించకపోవడమూ చర్చనీయాంశమే అయింది. అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తక్షణమే బండి సంజయ్ స్పందించడాన్ని అందరూ అభినందించారు.

కొన్ని అనుమానాలు …

మహానగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, ఐమ్ఐఎమ్ పార్టీలు దోస్తానా చేసినట్టే చేసి, ఎవరికి వారు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. అదంతా రాజకీయ నాటకం అన్నారు చాలామంది. ఇక అక్బర్ వ్యాఖ్యల వెనుక ప్రోత్సాహం ఇచ్చింది బీజేపీనేననీ కొందరి అనుమానం. ఎందుకంటే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో హైదరాబాద్ లో వెలసిన ఎమ్ఐఎమ్ పార్టీ ఏకంగా ఐదు స్థానాలు సంపాదించింది. ఈ ఉత్సాహంలోనే అక్బర్ కన్నూమిన్నూ కానక పిచ్చికూతలు కూశాడనీ కొందరు అంటున్నారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ విజయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని, అక్కడి ముస్లిమ్ ఓటర్లను ఆకర్షించేందుకు తద్వారా కాంగ్రెస్ కూటమికి పెద్ద దెబ్బ కొట్టేందుకు ఎత్తుగడ వేసి విజయం సాధించిందని కొందరు అంటున్నారు. అదే విధంగా హైదరాబాద్ లోనూ తెలుగువారిని, విశేషంగా ఆంధ్ర ప్రాంతపు వాసులను ఆకర్షించడానికి బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే అక్బర్ నోట పనికిమాలిన మాటలు వెలువడ్డాయనీ అభిప్రాయపడుతున్నారు. నిజానికి బీజేపీకి హిందూమత పార్టీగా ముద్ర ఉండగా, ఎమ్ఐఎమ్ ముస్లిములు పార్టీ అని పేరులోనే ఉంది. ఈ రెండు పార్టీలకు భాగ్యనగరంలో దశాబ్దాలుగా వైరం ఉంది. అందువల్లే అక్బర్ వ్యాఖ్యానించగానే, బండి సంజయ్ స్పందించాడనీ కొందరు చెబుతున్నారు.

ఎన్నెన్నో ప్రశ్నలు…

అక్బర్ ఏ కారణంగా పీవీ, యన్టీఆర్ ఘాట్లను కూల్చివేస్తామని అన్నాడో కానీ, అతనికి అసలు ఆ మహానాయకుల గురించి ఏమైనా తెలుసా? అనే అనుమానమూ కలుగుతోంది. పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి అక్బర్ కన్ను తెరిచాడో లేదో? ఇక యన్టీఆర్ అఖండ విజయం సాధించి, తెలుగునేలపై నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు అన్న విషయం కూడా అతనికి తెలుసో లేదో? భారత ప్రధానిగా మన తెలుగు బిడ్డ పీవీ చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణల కారణంగానే ఈ నాడు ఎంతోమంది జనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగుతున్నారన్న సత్యమైనా అతనికి తెలియదేమో? బడుగు వర్గాలకు బాసటగా నిలచి, ఈ రోజున ఎందరో బీసీ నాయకులు రాష్ట్ర కేంద్ర స్థాయిల్లో వెలుగు చూడటానికి కారకులు యన్టీఆర్ అన్న అంశమైనా అతనికి తెలుసా? ఇలా ఈ మహానాయకుల నందనవనాలను కూల్చివేస్తామన్న అక్బర్ అజ్ఞానాన్ని గురించి తలచుకున్న వారిలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ అజ్ఞాని ఇంకా గెలుపు సాధిస్తూ పోతే, అతణ్ణి నమ్ముకున్న జనానికి కూడా ఏదో ఒకరోజున నష్టం వాటిల్లక మానదనీ హైదరాబాద్ నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఏం చేయాలి?

చర్చోపచర్చలు ఎలా సాగినా, మరణించిన మహానాయకులను గౌరవించడం, వారి పేరున వెలసిన జ్ఞాపకాలకు అప్రతిష్ఠ కలుగకుండా చూసుకోవడం రాజకీయనాయకుల విధి. అంతేకానీ, తమ గెలుపు కోసం వారి పేర్లను చర్చల్లోకి తీసుకురావడం గర్హనీయమే అవుతుంది కానీ, అది ఎవరికీ గర్వకారణం కాదు. ఈ వ్యాసం రాసే సమయానికి ఇంకా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు పూర్తి కాలేదు. విజయం ఎవరిని వరిస్తుందో తేలలేదు. కానీ, మన మహానాయకులను అగౌరవ పరచిన వారికి తగిన బుద్ధి జనం చెప్పివుంటే అది అభినందనీయమే! అలా కాకుండా ఈ వ్యాఖ్యలు చేసిన వారి పార్టీకీ జై కొట్టిన జనాన్ని ఏమీ అనలేం. మన వాళ్ళకు మన నాయకులను గౌరవించే సంప్రదాయం ఏమీ లేదని సరిపుచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేం. అయితే తాత్కాలిక విజయాల కోసం ఇలాంటి పన్నాగాలు పన్నేవారికి ఏదో ఒకరోజున జనం బుద్ధి చెప్పకమానరు అనే సత్యాన్ని ఎవరూ మరచిపోరాదు.

ఇన్నాళ్ళకు తండ్రి బాటలో…

కె.రాఘవేంద్రరావు తండ్రి కోవెలమూడి సూర్య ప్రకాశరావు ఆ రోజుల్లో మేటి నటుడు, దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేత,రచయిత- ఇలా అప్పట్లోనే తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు కె.ఎస్.ప్రకాశరావు. ఆయన ఎన్ని చిత్రాలు రూపొందించినా, ప్రకాశరావు పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం ఏయన్నార్ తో రూపొందించిన ‘ప్రేమనగర్’. ఆ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లోనూ ప్రకాశరావే తెరకెక్కించడం విశేషం. అన్ని చోట్ల ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ విషయంలో తన తండ్రి తనకంటే మిన్న అని రాఘవేంద్రరావు చెప్పుకుంటారు. ఎందుకంటే రాఘవేంద్రరావు తండ్రిలాగే హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి, విజయం సాధించారు. అయితే తమిళంలో తండ్రిలాగా జయకేతనం ఎగురవేయలేకపోయారు. అలాగే తన తండ్రి నటనలోనూ రాణించారని, తాను అభినయానికి దూరం అంటూ ఉండేవారు. అలాంటి రాఘవేంద్రరావు తొలిసారి నటించబోవడం విశేషమే కదా!

రామారావుగారి వల్లే…

కె.రాఘవేంద్రరావు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. తన సినిమా, దానిని జనరంజకంగా ఎలా తెరకెక్కించాలి అన్న వాటిపైనే ఆయన ధ్యాస ఉండేది. అందుకే అందరికీ మౌనిలా కనిపించేవారు. యన్టీఆర్ తో “అడవిరాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, గజదొంగ, కొండవీటి సింహం, మేజర్ చంద్రకాంత్” వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన రాఘవేంద్రరావు ‘రామారావుగారు లేకుంటే తనకు ఈ స్థాయి ఉండేది కాదు’ అని వినమ్రంగా చెబుతూ ఉంటారు. ఈ మౌనమునిపై గతంలో ఇతరులు ‘సౌందర్యలహరి’ అనే కార్యక్రమం చేశారు. అయినా, అప్పట్లోనూ ఆయన పెదవి విప్పి మీడియాతో తన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్న సందర్భాలు లేవు. అయితే భావితరాలకు ఓ సినిమాను ఎలా జనరంజకంగా మలచాలో వివరిస్తూ ఆయన చేసిన ప్రయత్నం మాత్రం సర్వత్రా అభినందనలు అందుకుంది. ఇప్పటికీ యూ ట్యూబ్ లో రాఘవేంద్రరావు వీడియోలకు ఎంతో ఆదరణ ఉండడం విశేషం.

అదే అయితే… రికార్డే!

ఓ దిగ్దర్శకుడు తన 78వ యేట నటనలో అడుగు పెడుతూ ఉండడం అరుదైన విషయం. ప్రపంచంలో ఇంతకంటే ఎక్కువ వయసులో దర్శకులు తెరపై కనిపించిన సందర్భాలున్నాయి. అయితే ఈ వయసులో ప్రధాన పాత్రలోనే కనిపించబోతున్న క్రెడిట్ తప్పకుండా రాఘవేంద్రరావుకే దక్కబోతోంది. రాఘవేంద్రరావు గుణగణాలకు తగిన కథను రచయిత జనార్దన మహర్షి రూపొందించారు. దానికి దర్శకత్వం వహించే బాధ్యతను నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి చేపట్టారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఎన్నో చిత్రాల్లో నటించిన తనికెళ్ళ భరణి, దర్శకేంద్రునికే దర్శకత్వం వహించడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “మా కథలోని ప్రధాన పాత్రకు తగ్గ అన్నిలక్షణాలూ రాఘవేంద్రరావు గారిలో ఉన్నాయి. అందువల్ల ఆ కథకు రాఘవేంద్రరావు గారు ఒక్కరే న్యాయం చేయగలరని భావించాం. కథ వినిపించాం. అందుకు ఆయన కూడా ఎంతో ఆనందంగా అంగీకరించారు” అని భరణి వివరించారు.

ముగ్గురు నాయికలు!

రాఘవేంద్రరావు చిత్రాలలో హీరోయిన్లు ఎంతో అందంగా కనిపిస్తారు అనే పేరుంది. ఆయన చిత్రాల ద్వారానే జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ వంటి ఎంతోమంది తారామణులు తారాపథం చూశారు. అందువల్ల 78 ఏళ్ల రాఘవేంద్రరావుకు జోడీగా నటించేవారు ఎవరా అన్న ప్రశ్న కూడా తలెత్తక మానదు. ఆయన నటించబోయే చిత్రంలో ముగ్గురు పెళ్ళయిన నటీమణులే నటించనున్నారు. వారెవరంటే , ఆయన సినిమాల ద్వారా నాయికగా ఎంతో పేరు సంపాదించిన రమ్యకృష్ణ, ఆయన సినిమాల్లో నటించిన శ్రియ, ఇక మూడో నాయికగా సమంత అక్కినేని నటించనున్నారు. రాఘవేంద్రరావు చిత్రాల్లో పాటల చిత్రీకరణ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. అందుకే ఆయనను ‘షో మేన్’ అనీ పిలుస్తారు. మరి ఆయన నటునిగా నటించే చిత్రంలోనూ పాటలు ఉంటాయా? ఆయన లాగే భరణి పాటలను చిత్రీకరిస్తారా? అన్న ప్రశ్నలు మెదలు తున్నాయి జనాల్లో. 2021 ఫిబ్రవరి మాసంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. పక్కా ప్రణాళికతో సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జనం ముందు నిలపాలన్న ప్రయత్నంలోనే ఉన్నారు భరణి. మరి నటునిగా రాఘవేంద్రరావు తెరపై ఏ తీరున అలరిస్తారో చూడాలి.

Share: