మెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు నారీ స్ఫూర్తి పేరుతో వెబినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా మొదటగా వెబినార్‌లో రిపబ్లిక్ రాధారాణి.. వ్యాపార రంగంతో పాటు సేవారంగంలో తాను సాధించిన విజయాలను వివరించారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారితో మమేకం అవుతున్నట్టు తెలిపారు. ఇదే తన విజయ రహస్యమని రాధారాణి అన్నారు. సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్మ ప్రేమాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ స్టాలన్‌టస్ కంపెనీ నార్త్ అమెరికా అండ్ ఆసియా ఫసిపిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మమత చామర్తి ఈ వెబినార్‌లో తన ప్రస్థానాన్ని వివరించారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగం కోసం వచ్చిన మమత.. ఆటోమొబైల్ రంగంలో అత్యున్నత స్థానాలకు ఎదిగిన తీరును తెలిపారు. మార్కెట్‌లోకి వచ్చే కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ దానిని ఆటోమొబైల్ రంగంలో ఎలా వాడొచ్చనే దానిపై చేసిన కృషే తనను ఈ రోజు ఉన్నత స్థానంలో నిలిపాయని మమత చెప్పుకొచ్చారు. అంతర్గత శక్తిని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని వనితలకు సూచించారు. మానసిక శక్తితో సవాళ్లను ఎదుర్కోవలని తెలిపారు.
సాధించాలనే కసి.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వెయిట్ లిఫ్టర్ కగ్గా శిరోమణి కూడా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. కఠోర సాధనతో ఇప్పటివరకు వెయిట్ లిప్టింగ్‌లో 136 కు పైగా జాతీయ, అంతర్ జాతీయ పతకాలు సాధించినట్టు శిరోమణి తెలిపారు. కరణం మల్లీశ్వరిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. కామన్ వెల్త్, ఒలింపిక్స్‌లో సత్తా చాటడమే తన ముందున్న లక్ష్యమని శిరోమణి అన్నారు. అయితే తనకు ఆర్థిక సహకారం అందించే స్పాన్సర్లు ఉంటే తన లక్ష్యం నెరవేర్చుకోవడం మరింత సులువు అవుతుందన్నారు. ఈ కార్యక్రామానికి ప్రముఖ రంగస్థల కళాకారిణి రాజేశ్వరీ వ్యాఖ్యతగా వ్యవహరించారు.వెబినార్ నిర్వహణలో నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి, నాట్స్ ఈసీ జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం, విమెన్ ఎంపవర్‌మెంట్ ఛైర్ జయశ్రీ పెద్దిభొట్ల, ప్రొగ్రామ్ ఛైర్ లక్ష్మి బొజ్జ, చికాగో చాప్టర్ ఛైర్ ప్రసుధ, డాలస్ చాప్టర్ ఛైర్ దీప్తి సూర్యదేవర తదితరులు కీలక పాత్ర పోషించారు.
ఆన్‌లైన్ ద్వారా వందలాది మంది తెలుగు మహిళలు నారీ స్ఫూర్తి ని వీక్షించారు. చివరిగా, అరుణ గంటి, జ్యోతి వనం, జయశ్రీ, లక్మి , రాజేశ్వరీ ఈ కార్యక్రంలో పాల్గొన్న రాధారాణి, మమత మరియు శిరోమణిలకు కృతజ్ఞలు తెలియచేసారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం అవటానికి తమవంతు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. వక్తలు, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాజేశ్వరిని అభినందించారు. కాగా.. వెయిట్ లిఫ్టర్ కగ్గా శిరోమణికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు.. నాట్స్ తనవంతు సాయంగా ఆన్‌లైన్‌లో ఫండ్ రైజ్ చేయనున్నట్టు చెప్పింది. https://www.natsworld.org/donate-now/ లింక్ ద్వారా విరాళాలు అందించాలని కోరింది. భవిష్యత్తులో కూడా సమాజహితంగా ఉండే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సాయం అందిస్తామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే తెలియచేస్తూ, నాట్స్ విమెన్ టీం ను ప్రత్యేకంగా అభినందించారు.
వనితలకు స్ఫూర్తి నిచ్చేలా నాట్స్ వెబినార్
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021