యన్న్టిఆర్ ఇంటర్ రెండుసార్లు తప్పి మూడవసారి పాసయ్యారు. వ్యాపారాల్లో చేతు క్చాుకున్నారు. ఇక నిమ్మకూరుకు వెళ్ళి పొం సాగు చేసుకోవడమే మంచిదనుకున్నారు. షోకు రామయ్య విజయవాడకు వచ్చినప్పుడు ఆయనతో యన్‌టిఆర్ తన నిర్ణయాన్ని చెప్పారు. ఆ మాట విని రామయ్య బాధపడ్డారు. యన్‌టిఆర్ చదివి, ప్రభుత్వంలో అధికారిగా ఉద్యోగం సంపాదించాని ఆయన కోరిక. రైతు జీవితం కావానుకుంటే విజయవాడలో అన్ని సంవత్సరాు కష్టాు పడాల్సిన అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. పొం దున్నడానికయితే అయిదవ తరగతిలోనే చదువు ఆపి ఉండాల్సింది కదా అని కేకలేసారు. రామయ్య అలా ఒంటి కాలిమీద లేస్తే తన నిర్ణయానికి యన్‌టిఆర్ ఇంకొక కారణం చూపించారు. బి.ఏ. చదివేందుకు విజయవాడలో కాలేజీ లేదు. గుంటూరు వెళ్ళాలి. ఒకవేళ అక్కడ అష్టకష్టాు పడి చదివినా బి.ఏ. పరీక్ష నెగ్గుతామనే గ్యారంటీ ఏమీలేదు అన్నది ఆయన వాదన. రామయ్య తన పంతాన్ని వదల్లేదు. చదువుకునే ఉద్దేశం, పట్టుదలా ఉండాలే కానీ విజయవాడైనా గుంటూరైనా ఒకటే అని గట్టిగా అన్న తర్వాత యన్‌టిఆర్ ఇక మాట్లాడలేదు.
బి.ఏ. చదవడానికి గుంటూరులోని ఏ.సి. కాలేజీలో యన్‌టిఆర్‌్ చేరారు. కాలేజీ చదువు నెపంతో ఆయన తండ్రికి సాయం చెయ్యడం మానలేదు. అది ఆయన తత్వం కూడా కాదు. మునుపటిలాగే పా వ్యాపారంలో తండ్రికి సాయం చేస్తున్నారు. జొన్న అన్నం తిని రోజూ రైల్వే స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవారు. ఉదయం ఎనిమిదిన్నర గంట గుంటూరు రౖుె ఎక్కేవారు. ఆ రోజు చివరి క్లాస్ లేకపోతే సాయంత్రం 4:30 గంటకల్లా తిరుగు రౖుెబండి పట్టుకునేవారు. చివరి క్లాసు తొగు సాహిత్యం అయితే, ఆ రౖుె అందేది కాదు. అలాగే సాయంకాం నాటకం రిహార్సల్ లేదా విద్యార్థు సమావేశం ఉంటే రాత్రి 10:20 రౖుెబండి పట్టుకుని రాత్రి 11 గంట తరువాత ఇు్ల చేరేవారు. ‘‘అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా చీకట్లో లాంతరు పట్టుకుని మా అమ్మ నాకోసం దారి కాసేది’’ అని యన్టీఆర్ చెప్పేవారు.
గుంటూరులోని ఆంధ్రా యూనివర్సిటీకి ఆరోజుల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కూర్మా వేణుగోపాస్వామి నాయుడు. ఆయన గొప్ప కళాపోషకుడు. నాటకాు వేయమని ఆయన విద్యార్థును ప్రోత్సహించేవారు. ఆరోజుల్లో గుంటూరులో ప్రతి సంవత్సరం నిర్వహించే నాటక వారోత్సవాకు అసంఖ్యాకంగా అభిమానుండేవారు. ఆ వారోత్సవాకు వేణుగోపాస్వామిగారే స్ఫూర్తి. అప్పట్లో ఏ.సి.కాలేజీ ప్రిన్సిపాల్ హెచ్. హెచ్. సైఫ్స్ కూడా అంతే ఉత్సాహంతో విద్యార్థును నాటకాకు తయారుచేసేవారు. ఆయన ప్రోద్బం వ్లనే ఏ.సి. కాలేజీలో డ్రామా సొసైటీ పటిష్టంగా
ఉండేది. విద్యార్థు తమ కాలేజీలోనే గాక నాటకోత్సవాలోనూ, పరిషత్ పోటీలోనూ నాటకాు ప్రదర్శించి బహుమతు గెలిచేవారు. తన కాలేజీ సహాధ్యాయులైన కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్.శర్మ, అప్పటికే నాటకరంగంలో పేరున్న ముక్కామ, వ్లభజోస్యు శివరాంతో కలిసి యన్టీఆర్ నాటకాు వేశారు. యన్‌టిఆర్, జగ్గయ్యది విజయవంతమైన కాంబినేషన్. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన శాక్రిఫైస్ నాటకాన్ని జగ్గయ్య బలిదానం పేరుతో అనువదించి యన్‌టిఆర్‌తో కలిసి విజయవంతంగా ప్రదర్శించేవారు. ఆలి ది కాబ్లర్ నాటకంలో హీరో వేషం జగ్గయ్య వేస్తే, యన్‌టిఆర్ సయ్యద్ పాత్ర పోషించేవారు. 1946లో ఈ నాటకంలో నటనకు జగ్గయ్య, యన్‌టిఆర్ ఉత్తమ నటుడు అవార్డును పంచుకున్నారు. ముక్కామ కృష్ణమూర్తి దర్శకత్వం, సుబ్రహ్మణ్యం స్టేజి లైటింగ్ వారి నాటకా విజయానికి దోహదం చేసేవి.
1946లో గుంటూరులో బి.ఏ. చదువుతున్న రోజులోనే యన్‌టిఆర్ తన స్వంత నాటక సమాజాన్ని నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో ప్రారంభించారు. ఆయన తమ్ముడు, పుండరీకాక్షయ్య కలిసి నాటక ప్రదర్శన నిర్వహణ బాధ్యతను చూసుకునేవారు. దాన్నొక స్వచ్చంద సంస్థలా, లాభాపేక్ష లేకుండా నడుపుతూ నాటకాు వేశారు. అందులో నటుకు పారితోషికం లేదు. దుస్తు, మేకప్ ఖర్చు కూడా వారే సొంతంగా భరించాలి. మూడు రూపాయతో నాటకం వేసేవారు. కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్.శర్మ, మరికొందరు స్నేహితు ఆ సంస్థలో చేరి ఎనమకుదురు వాస్తవ్యు డి. బి.వి.కృష్ణచౌదరి రాసిన వేనరాజు విప్లవం, మ్లమ్మ ఉసురు, రాణాప్రతాప్ వగైరా నాటకాను ప్రదర్శించేవారు. వేనరాజు విప్లవంలో యన్‌టిఆర్ వేసే వేనరాజు వేషానికి రాజసానికి తగ్గట్టు దుస్తు కావాలి. స్కిు పంచె కొనడానికి పైకం లేదు. తన తల్లి దగ్గర ఉన్న ఒక కొత్త ముదురు ఊదా రంగు చీరను ఆమెకు చెప్పకుండా గుట్టుగా తీసుకుని, పంచెగా విరిచికట్టి ఠీవిగా స్టేజి మీదకు వచ్చారు. ఎదురుగా పిువకనే వచ్చి నాటకం చూస్తున్న తల్లి వెంకటరావమ్మను చూసి మొదట్లో కంగారు పడ్డా, తమాయించుకొని నాటకం రక్తి కట్టించారు యన్‌టిఆర్. నాటకం అయిపోయిన తరువాత ‘‘ఆ చీరలో నువ్వెంత బాగున్నవో తొసా?’’ అన్నారు హాయిగా ఆ తల్లి. అంతేకాదు. ‘‘ఆ చీర మీరే ఉంచేసుకోండి’’ అన్నారామె. ఆ చీర ఇక మీదట నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ఆస్తిలో శాశ్వతంగా జమయిపోయింది.
ఎం.మల్లికార్జునరావు అప్పట్లో హిందూ కాలేజీ విద్యార్థి. తరువాతి కాంలో కృష్ణ హీరోగా నటించిన ‘గూఢచారి 116’ వంటి విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించారు. 1930 నాటి గాయక నటి సీనియర్ శ్రీరంజని కుమారుడు. సీనియర్ శ్రీరంజని 1934వ సంవత్సరంలో సి.ప్లుయ్య తీసిన ‘వకుశ’ సినిమాతో వెండితెరకు పరిచయమై తొమ్మిది సినిమాల్లో నటించి, ముప్ఫై నాుగేళ్ళకే 1940లో కాం చేసారు. శ్రీరంజని భర్త నాగుమణి అప్పటి ‘కాళిదాసు’ సినిమా నిర్మాత. యన్‌టిఆర్ గురించి, అతని నటనా వైదుష్యం గురించి తన కొడుకు ద్వారా విన్న ఆయన నాయకురాు నాటకం చూడడానికి గుంటూరు వచ్చారు. అందులో మల్లికార్జునరావు బాచంద్రుడు వేషం వేస్తే, యన్‌టిఆర్ నగామరాజు పాత్రను పోషించారు. యన్‌టిఆర్ అందానికి, రాజసం ఉట్టిపడే ఆయన విగ్రహానికి, డైలాగు పలికే విధానానికి, నటనా నైపుణ్యానికి నాగుమణి ముగ్ధుడయ్యారు. సినిమారంగంపై పట్టు ఉన్నందున ప్రతిభను సుభంగా పసిగట్టే నేర్పు ఆయనకు అవడిరది. నాటకం చూసిన రాత్రే యన్‌టిఆర్ సినిమాకు పనికివస్తారని తీర్పు చెప్పారు. దర్శక – నిర్మాత సి.ప్లుయ్య తన కొత్త సినిమా కీుగుర్రంలో యువరాజుగా నటించడానికి అందగాడైన యువకుడి కోసం అన్వేషణలో ఉన్నారు. దానికి ఆయన నాగుమణి సాయం కోరారు. నాటకం చూసిన తర్వాత నాగుమణి సి.ప్లుయ్యగారికి యన్‌టిఆర్ గురించి చెప్పారు. ఆయన యన్‌టిఆర్‌ని తన వద్దకు తీసుకురమ్మని నాగుమణికి చెప్పారు. యన్‌టిఆర్ ఎక్కడ ఉంటారో నాగుమణికి తెలియదు. ఆయన కొడుకు మల్లికార్జునరావుకి కూడా తెలియదు. రోజూ ఉదయం 8:30 రౖుె బండికి అతను విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాడని తొసుకుని, వాళ్ళిద్దరూ ఏూరు కావ వంతెన దగ్గర కాపలా కాసి యన్‌టిఆర్‌ను పట్టుకున్నారు.
ప్లుయ్యగారు బస చేసిన పూర్ణానంద సత్రానికి యన్‌టిఆర్‌ని వాళ్లు తీసుకెళ్లారు. ప్లుయ్య ఫోటోగ్రాఫర్‌ను పిలిచి యన్‌టిఆర్ ఫోటోు తీయించారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తానని ఆయన యన్‌టిఆర్ కు చెప్పారు.
1946 డిసెంబర్లో ప్లుయ్యగారి ఉత్తరం యన్టిఆర్కు అందింది. ‘‘కీుగుర్రం’’ సినిమా కాక ప్రస్తుతం ‘‘వింధ్యరాణి’’ అనే సినిమా తీస్తున్నట్లు, అందులో హీరో పాత్రకు యన్‌టిఆర్‌ని తీసుకున్నామని ఆ ఉత్తరంలో తెలిపారు. సినిమారంగానికి యన్‌టిఆర్ కొత్త. అందువ్ల ముందుగా ఆరు నెలు మద్రాసులో సినిమా నటనలో శిక్షణ తీసుకోవాని యన్‌టిఆర్ ఉత్తరంలో సూచించారు. సినిమారంగం అంటే యన్టిఆర్కు ఇష్టమే. సినిమాల్లో నటించాని ఉబలాటం ఉంది. అందుకే ఆయన ప్లుయ్యను కుసుకున్నారు. కానీ ఇంటర్లో తప్పడం తనను బాధిస్తోంది. అందుకే ఎలాగైనా బి.ఏ. అవ్వాని క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలో సినిమా అంటే బి.ఏ.కు అడ్డం అవుతుంది. అంతేకాదు సినిమా నటజీవితం అస్థిరమైంది. ఒకరకంగా జూదమే. రాణించవచ్చు. రాణించకపోవచ్చు. బి.ఏ.డిగ్రీ చేతిలో ఉంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది ఆస్యంగానైనా విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి, అప్పటికి చదువే ముఖ్యమని నిర్ణయం తీసుకున్నారు ప్లుయ్యగారికి తిరుగు జవాబు కూడా యన్‌టిఆర్ రాయలేదు.
ప్లుయ్యగారికి పట్టుద ఎక్కువ. ఆయన విజయవాడకు వచ్చి యన్‌టిఆర్‌ని కుసుకున్నారు. సినిమారంగం అంటే తనకు ఇష్టమే అయినా, బి.ఏ. పూర్తిచేయడం తన ప్రస్తుత క్ష్యమని యన్‌టిఆర్ ఆయనకు వివరించి చెప్పారు. తన సినిమాలో నటించే అవకాశం, అందులోనూ హీరోగా కాదంటున్న యన్‌టిఆర్‌ని చూసి ప్లుయ్య మ్రాన్పడిపోయారు. ఆయన నోటమాట రాలేదు. ఎలాగైనా అతన్ని తన సినిమాలో నటించడానికి ఒప్పించాని ఆయన క్ష్మయ్య గారిని కలిశారు. యన్‌టిఆర్ సినీరంగంలో రాణిస్తాడు. అతని భవిష్యత్తు ఉజ్వంగా ఉంటుందని చెప్పి, ఎలాగైనా యన్‌టిఆర్‌ని ఒప్పించమని కోరారు. క్ష్మయ్య ఆయన చెప్పింది శ్రద్ధగా విని ‘‘ఇందులో నాదేం లేదు. అంతా అబ్బాయిగారి ఇష్టమే’’ అని తేల్చి చెప్పేశారు.
ప్లుయ్యగారు తొందరలోనే సినిమా షూటింగు మొదుపెట్టానే హడావుడిలో ఉన్నారు. యన్‌టిఆర్ సమాధానం ఆయనకు నచ్చలేదు. క్ష్మయ్యగారి మాట కూడా నచ్చలేదు. పట్టు విడువకుండా యన్‌టిఆర్‌ని కలిసి మళ్ళీ అలోచించమన్నారు. క్ష్మయ్యగారి మాటను కూడా ఉటంకించారు. ‘‘డిగ్రీ పూర్తయ్యాకే సినిమారంగంలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇప్పుడు కాదు’’ అని యన్‌టిఆర్ సుస్పష్టంగా అన్నారు. రెండుసార్లు యన్‌టిఆర్ ఇంటర్ తప్పిన విషయం తెలిసిన ప్లుయ్య ఇంటరు మొదటిసారి పాసు కాలేదు కదా? మొదటి సారే బి.ఏ. గట్టెక్కుతావని ఏమిటి గ్యారంటీ? అని కొంచెం ఎకసక్కెంగా యన్‌టిఆర్‌ని అడిగారు. ‘‘గతం గతః ఇంటర్ చరిత్ర పునరావృతమవదు. బి.ఏ. మొదటిసారే తప్పక పాసవుతాను’’ అని ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు యన్‌టిఆర్. తను సూర్యుణ్ణి చూపిస్తూంటే యన్‌టిఆర్ ఒక చిన్న దివిటీని పట్టుకుని దారి వెతుక్కుంటున్నాడేమిటా అని ప్లుయ్యగారు ఆశ్చర్యపోయారు.
1947 ఏప్రిల్ 11వ తేదీనాడు బి.ఏ. ఆఖరు పరీక్ష రాసి, మరోసారి పరీక్ష రాయాల్సిన అవసరం లేదని యన్‌టిఆర్ హాయిగా ఊపిరి మ్చీకున్నారు. అనుకున్నట్లుగానే పరీక్షలో ఉత్తీర్ణుయ్యారు. ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టుగా ఆయన బ్యాచిర్ ఆఫ్ ఆర్ట్స్, అంటే పట్టభద్రుయ్యారు. ఆయన ఇప్పుడు యన్.టి.రామారావు, బి.ఏ.