చాలామంది తమ శక్తి సామర్ధ్యాను అతి తక్కువ స్థాంలో వినియో గించుకొంటుంటారు. కొద్దిమంది మాత్రమే తమ సామర్ధ్యాన్ని వీలైనంత అధికంగా వినియోగించుకోగ శక్తిని సంతరించుకొంటారు. ఇందుకు భిన్నంగా ఇతరుతో కసి సమష్టిగా కృషి చేయగలిగినప్పుడు వ్యక్తిగత స్థాంలో కంటే వంద రెట్లు ఎక్కువ స్థాంలో విజయాను సాధించడం సాధ్యపడుతుంది.
గోపారావుకు ఒక పెద్ద విద్యాసంస్థ నెకొల్పాని జీవిత ధ్యేయం. తాను పెట్టగలిగిన అతి తక్కువ పెట్టుబడితో ఒక జూనియర్ కాలేజీని నెకొల్పాడు. కొద్దికాంలోనే తీవ్రమైన నష్టాను ఎదుర్కొని దానిని వూసివేయాల్సి వచ్చింది. అటు తరువాత ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వాహకునిగా ఉద్యోగంలో చేరి కాలేజీ నడపడంలోని మెకువన్నీ ఆకళింపు చేసుకున్నాడు. మంచి పెట్టుబడితో ఇంజ నీరింగ్ కాలేజీ నెకొల్పితే అభివృద్ధికి బాగా అవకాశా ున్నా యని గుర్తించి పెట్టుబడికోసం తన మిత్రును సాయం కోరాడు. ఎవ్వరూ వందుకు రాలేదు. చివరకు విద్యా రంగంతో ఏ మాత్రం సంబంధం లేకపోంనా మంచి పేరు ప్రతిష్టు ఉన్న ఒక ధనిక మిత్రుడిని కలిశాడు. ఆయన వెంటనే కోట్ల రూపా య పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు. గోపా రావు తనకు సన్నిహితులైన కొందరు విద్యావేత్తతో అన్ని విషయానూ చర్చించి ఇంజనీరింగ్ కళాశాను ప్రారంభించాడు. ఇది విజయవంతం కావడంతో, అనుబంధంగా అనేక విద్యాసంస్థను నెకొల్పాడు. ఇప్పుడు ఆ విద్యాసంస్థలో పదివేకు పైగా విద్యార్ధు చదువుకుంటున్నారు.
గోపారావుకు ఇదంతా ఒక అద్భుతంలా అనిపిస్తుంటుంది. కళాశా నిర్వహణపట్ల తనకు మంచి అవగాహన వుంది. ఆ అవగాహనకు మిత్రుడి పెట్టుబడిని ఇతర మిత్రు నుంచి సహాను జోడిరచడం ద్వారా ఒక అద్భుత విజయం సాధ్యమైంది. ఎవరికి వారుగా సాధించలేని విజయాన్ని సమష్టిగా సాధించ వచ్చనడానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ.
మనదేశంలో ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఒక పరిధిని ఏర్పరచుకొని దాని లోపలే మిగిలి పోవడానికి ఇష్టపడతారు. కొత్త వ్యక్తుతో వ్యాపార సంబంధాు పెట్టుకోవడానికి కొత్తగా అనుబంధాు ఏర్పరచుకోవడానికీ వెనుకాడుతుంటారు. వారు తమను అనుమానిస్తారేమోనని తమను వారి స్వార్ధ ప్రయోజనాకు ఉపయోగించు కొంటారేమోనని భయపడుతుంటారు. భిన్న పరిసరాకు చెందినవారు భిన్న ప్రవృత్తి, విభిన్న ఆలోచనా ధోరణు ఉన్నవారు ఒక క్ష్యం కోసం కసినప్పుడు వందుగా ఒక అనిశ్చితి ఏర్పడు తుంది. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చాలామంది ఇటువంటి అనిశ్చిత స్థితిని ఎదుర్కోవడానికి సంకోచిస్తూ జీవితంలో ఒంటరిగా మిగిలిపోతుంటారు. సమష్టిగా విజయాన్ని సాధించ డానికి సమాయాత్తం కారు.
అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి సొంతంగా సినిమా నిర్మించ డానికి అందుకు తగిన పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే అదెప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకు భిన్నంగా పెట్టుబడిపెట్టే నిర్మాతను తన కథకు సరిపడిన నటును, ఇతర నిపుణును కూడగడితే ఒక విజయ వంతమైన సినిమాను రూపొందించ గుగుతాడు. విక్షణ ప్రతిభా సంపత్తీ, విభిన్న వ్యక్తిత్వాు ఒక క్ష్యం కోసం కగలిసి నప్పుడు ఏ ఒక్కరికీ వ్యక్తిగతంగా సాధ్యపడని అద్భుత ఫలితాు భిస్తాం.
ఒకప్పుడు కేరళలోని పట్టణాలో పనిచేసే ఉద్యోగు నిత్యావసర వస్తువు ధరు అధికంగా ఉంటున్నాయని బాధపడు తుండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగి తమ గ్రామం నుంచి బియ్యాన్ని అతి తక్కువ ధరకు కొని తెచ్చి అదే ధరకు తోటి ఉద్యోగుకు అమ్మడం ప్రారం భించాడు. దాన్ని అనుసరిస్తూ ఇతర ఉద్యో గు కూడా తమ గ్రామాలో భించే సరుకును తోటివారికి తక్కువ ధరకే అందించడం ప్రారంభిం చారు. ఇది గమనించిన ఓ సొసైటీ – దళారు ప్రమేయం లేకుండా ఉత్పత్తిదారు నుంచి వినియోగ దారుకు నేరుగా అతి తక్కువ లాభాతో రకరకా వస్తువును అందించే ‘మార్జిన్ ఫ్రీ మార్కెట్’ను ప్రతి పట్టణంలోనూ స్థాపించింది. ఈ మార్కెట్లో కొనుగోు చేయడం వ్ల నెకు అందారు వంద రూపాయు ఆదా అవుతున్నాయని ఇప్పుడు ప్రతి గృహిణి ఎంతో సంతోషిస్తోంది. విస్తృత స్థాంలో అనేకమంది సమష్టి కృషి వ్ల ఆ రాష్ట్రంలో క్షలాది మంది లాభపడుతున్నారు.
ఒక స్వచ్ఛంద సంస్థ విరాళాు పోగు చేయడానికి తన కార్యకర్తను పంపేది. ఒంటరిగా వెళ్లినవారు వట్టి చేతుతో తిరిగి వచ్చేవారు. నుగురు కలిసి ఒక బృందంగా వెళ్లినచోట పెద్ద వెత్తంలో విరాళాు వచ్చేవి. ఒకరుగా వంద రూపాయు సేకరించేచోట నుగురంతే రెండు వూడు వే వరకు సేకరించ గలిగేవారు. అమెరికన్ విశ్వవిద్యాయాల్లో నుగురు అందుగురు విద్యార్ధు బృందాన్ని ఏర్పరచి వారికి ఒక కీకమైన కార్యక్రమాన్ని అప్పచెబు తారు. వెదట్లో భయపడినా చివరకు అందరూ కసి దాన్ని అతి సుభంగా చేయగుగు తారు. ఈ ప్రక్రియను ఇంటలెక్చువల్ నెట్వర్కింగ్ అంటున్నారు.
జీవితంలో ఎవరంతట వారు సాధించగ విజయాు పరిమిత స్థాంలో వుంటాం. ఇతరుతో జతగూడినప్పుడు అద్భుత విజయాు చేకూరుతాం. ఇలా ఒక చిన్న ప్రయోజనం కోసం జతగూడడం వందుగా ఇళ్లలోనే ప్రారంభమవుతుంది. భార్యాభర్త లిద్దరూ కలిసి తమ ప్లిను
ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సమష్టిగా కృషి చేస్తారు. ఇద్దరూ నిరంతరం తావ సాధించవసిన క్ష్యాన్ని గురించే ఆలోచిస్తారు. ఒకరి కొకరు తమ సహాయ సహకారాను అందించుకొంటారు. jద్ధభూమిలో సైనికు ఇదే సమష్టితత్వంతో విజయానికై పోరాడతారు.
ప్రకృతిలో.. సమాజంలో.. ప్రతిచోటా కన్పించే ఈ సమష్టి కృషిని అద్భుతవిజయాు సాధించడానికి సోపానంగా వాడుకోవచ్చు. ప్రపంచ మంతటా దీని ప్రాధాన్యాన్ని గుర్తించారు. దీన్నే ఆంగ్లంలో ‘సినర్జీ’గా వ్యవహరిస్తున్నారు. ఇతరుకూ తమకూ మధ్య వున్న వైవిధ్యాను గుర్తించి గౌరవిస్తూ, తమ తమ శక్తి సామర్ధ్యాను జతకలిపి అద్భుత విజయం వేపు అడుగువేయడమే సమష్టికృషికి వూసూత్రం.
సమష్టి కృషి అద్భుత విజయానందిస్తుంది
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021