రకరకా వ్యక్తిత్వా మధ్య వే సంబంధాు కుదురుస్తూ ఉంటాం. ఎవరి అభిప్రాయాు వారివి. వారికి ఏమి కావాలో దాని ప్రకారం పని చేయటం మా ధర్మం. కానీ, కొందరి విషయంలో ఎంత రాజీపడి పని చేద్దామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటోంది. వాస్తవ పరిస్థితుకు దూరంగా మితిమీరిన ఊహాప్రపంచంలో విహరిస్తూ మమ్మల్ని చాలా ఇరకాటంలోకి నెట్టేవారి విషయం గురించి ప్రస్తావిస్తున్నాను. అసు వారికున్న ఆస్తు మివ సుమారు పదికోట్లు అయితే యాభైకోట్లు అనో లేక ఇంకేదో పెద్ద అంకె చెబుతారు. మేము తీసుకునే పది, ఇరవైకి ఆ ఊరు వెళ్ళి ఆ పొలాు ఆస్తు చూసి అంచనాు వేసి నిగ్గుతేల్చి చెప్పలేము. ఇటు ఆడప్లివారైనా సరే మగప్లివాడి వారైనా సరే. ఎందుకిలాంటి తప్పుడు లెక్కు తప్పటడుగు అలా చెప్పి అదే నిజమనుకుని రేపేదో సంబంధం కుదిరినా ఎప్పటికైనా నిజాు తొస్తాయి. అప్పుడు మన బిడ్డ మివ ఏంటి. ఒకటి అభాసుపాలై జీవితాంతం ఆ బిడ్డ తల్లీదండ్రీ చెప్పిన అబద్ధానికి పెళ్లైన చోట దిక్కుమాలిన దిగజారిన జీవితాన్ని మాటు పడుతూ బ్రతకాలి లేదా విడాకు వరకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమి ఎదురుచూసి ఇలాంటి అబద్ధాు చెప్పి పెళ్ళి చెయ్యటం. పెళ్ళి అనేది రియాలిటీ తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. దయచేసి రేపు ఏమౌతుందో అప్పుడు చూసుకుందాం అనుకుని ప్లి జీవితాతో ఆడుకోకండి. పాపం వివాహవ్యవస్థ పట్ల, తమ తల్లిదండ్రు పట్ల ఉన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారి భవిష్యత్తుని వ్యాపారం చేయకండి. అదే విధంగా ఇవతలి వైపు వారు కూడా దయచేసి పెళ్ళికి ముందే అన్ని వివరాు తొసుకుని ఎంక్వయిరీ చేసుకుని ఆపైనే మాకు బయోడేటాలో వారు పొందుపరచిన వివరాలే తప్పించి మేము స్వయంగా ఎంక్వయిరీ చేసి ఖచ్చితంగా వ్రాసినవి కావు.
రెండు వారా ముందు ఒక సంబంధం దాదాపుగా తారీఖు వరకు వెళ్ళింది. అమ్మాయి వాళ్ళు వంద అని అబ్బాయి వాళ్ళు మూడు వందని చెప్పారు. పెద్దవాళ్ళు, ప్లిు ఆల్ ఓకే. ఒకరిది కృష్ణా మరొకరిది న్లెూరు. అందరిని అడిగి నట్టే ఇద్దరినీ అడిగాను. ఆస్తువీ ఏమిటో మీరిద్దరూ మాట్లాడు కోవాలి, మాట్లాడుకున్నారా అని. ఎందుకంటే వారి వారి స్థిరాస్తు తప్పకుండా చూసే ఇరువురు ముందుకొచ్చారు. ఇది పెద్దు కుదిర్చే పెళ్ళి. రేపు ప్లి ముందు మీరు దోషు కాకూడదు. అందుకే అందరికీ ఇదే చెబుతాం. అబ్బాయి వాళ్ళ నాన్న మొహమాట పడుతూనే అన్ని వివరాు వీరివి వాడికి చెప్పి దగ్గరుండి చూపించి వారివి అడిగి తొసుకుని తెలిసిన వారి ద్వారా ఎంక్వయిరీ చేస్తే వంద అని చెప్పిన వాటి మివ ఎక్కువెక్కువగా వేసినా 18 దాటట్లేదు. అదేంటని అమ్మాయి వాళ్ళని అడిగితే. అవి ఫ్రెం ప్రోపర్టీస్ అండి పదేళ్ళు మీరు మర్చిపోతే వందేంటి ఇంకాపైనే చేస్తాయని చెప్పారు. నేను ఏమి చెప్పదచానో ఈ సంఘటనే వివరిస్తుంది. ఒకటి ఊహాలోకంలో ఉంటూ ప్లి జీవితాతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి. రెండు ఎవరికి వివరాలిచ్చినా రూపాయి తక్కువ చెప్పండి తప్ప. ఇదిగో ఇలా క్పనను సృష్టించకండి. మీరు పెళ్ళి సంబంధం కుదుర్చుకోవటానికి ముందే ఇలాంటి వివరాన్నీ క్షుణ్ణంగా స్వయంగా పరిశీలించుకోండి.
నవీన కామ్
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021