‘జయసింహలో రెండు స్త్రీ పాత్రు ఉన్నాయి. అప్పటికే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన అంజలీదేవి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. రెండవ కథానాయిక పాత్రకు ఆమెకంటే వయసులో చిన్న అమ్మాయి కావాలి. ఆ పాత్రకు వహీదా రెహమాన్‌ను ఎంపిక చేసి ఆమెతో అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. ‘జయసింహ’ ఆమెకు తొలి సినిమా.
ఎన్ఏటీ వారితో కాంట్రాక్టు ప్రకారం వహీదా రెహమాన్ రెండేళ్ల వరకు వేరే బేనర్ చిత్రంలో నటించకూడదు. హీరోయిన్ గా వేషం వేస్తున్న అమ్మాయి కక్కుర్తి పడి వేరే సినిమాలో చిన్న వేషాు ఒప్పుకుంటే సంస్థకు అప్రతిష్ట అని అలాంటి కాంట్రాక్టును రాసుకున్నారు. కాకపోతే ఈ కాంట్రాక్టు అమల్లో ఉండగానే, ‘జయసింహ’ షూటింగు జరుగుతున్న సమయంలోనే ఆమె మరొక సంస్థ చిత్రంలో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చింది. ఇది యన్టీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు రిజిస్టర్డ్ నోటీసు పంపారు. అయితే వహీదా రెహమాన్ తల్లి చాలా తెలివైనవారు. ‘‘ వహీదా అగ్రిమెంటుపై సంతకం పెట్టిన నాటికి మైనరు. అందువ్ల ఆ కాంట్రాక్టు చట్టబద్ధం కాదు’’ అని సమాధానమిచ్చింది. దీంతో యన్టీఆర్ అగ్గిమీద గుగ్గిమయ్యారు. ఈ సమాధానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆమెకు తగు విధంగా గుణపాఠం నేర్పాని నిర్ణయించుకున్నారు. ‘‘అగ్రిమెంటుపై సంతకం చేసే నాటికి ఆమె నిస్సందేహంగా మేజర్. ఆమె తండ్రి విజయవాడకు బదిలీ కాకముందు తమిళనాడులో పనిచేశారు. ఆమె కచ్చితంగా కడూరు లేదా చెంగ్పట్టులో పుట్టి ఉండాలి. ఆయన మున్సిపల్ కమిషనర్ కనుక ఆమె జననాన్ని తప్పకుండా రిజిస్టర్ చేయించి ఉంటారు. వెళ్లి ఆ జనన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని రండి’’ అని ఆయన గుమ్మడి, డి.వి.ఎస్.రాజుకు ఆ పని అప్పచెప్పారు. వాళ్ళు మొదట కడూరు వెళ్లారు. అక్కడ ఏ ఆధారం దొరకలేదు. తరువాత చెంగ్పట్టు వెళ్ళారు. ఆమె జననం అక్కడ రిజిస్టర్ అయింది. ఆ జనన ధ్రువీకరణ పత్రం జతపరచి, ఎన్ఎటీ సంస్థ లీగల్ నోటీసు ఈసారి వహీదా రెహమాన్‌కు పంపించింది. భంగపడిన వహీదా తల్లి మన్నించాని వేడుకుంది. తన క్షమాస్త్రంతో ఆమెని చిత్తు చేశారు యన్టీఆర్.
1955 అక్టోబరు 21 న విడుదలైన ‘జయసింహ’ సంచన విజయం సాధించింది. రజతోత్సవ వేడుకు జరుపుకొంది.
‘చంద్రహారం’ పరాజయంతో విజయా ప్రొడక్షన్స్ నష్టా ఊబిలో చిక్కుకుపోయింది. ‘చంద్రహారం’ సినిమాను ఎంతమంది చెప్పినా వినకుండా మొండిగా నిర్మించడం వ్ల చక్రపాణి కీర్తి ప్రతిష్ఠు దెబ్బతిన్నాయి. సంస్థకు పునర్వైభవం సాధించాని ఆయన సంకల్పించారు. ఆ క్రమంలో ఆయన గతంలో బెంగాలీ నుంచి తొగులోకి అనువాదం చేసిన రెండు కథను కలిపి ఒక కథగా రూపొందించారు. నిరుద్యోగ సమస్య ప్రధానాంశంగా హాస్యరసభరితంగా చక్కటి కథాగమనంతో నడిచే ఆ చిత్రం ‘మిస్సమ్మ’. ఈ సినిమా కథ మొత్తం చిన్నతనంలో తప్పిపోయిన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు మిస్సయిన బాలికే పెద్దయ్యాక ఈ సినిమా కథానాయిక మిస్సమ్మ ( మిస్ G అమ్మ ) గా మారుతుంది.
ఏఎన్నార్ ఈ చిత్రంలో ప్రయోగాత్మకంగా హాస్యపాత్రలో నటించారు. ‘దేవదాసు’ లాంటి విషాద ప్రేమకథలో నటించిన తరువాత అందరూ ఆయనను అదే తరహా సీరియస్ పాత్రు చేయమని అడగడం మొదు పెట్టారు. ఆ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదని, తను అన్నిరకా పాత్రను పోషింగగనని నిరూపించడానికి ఆయన ఆ వేషం చక్రపాణి గారిని అడిగి మరీ వేశారు.
భానుమతి ఈ సినిమాలో హీరోయిన్ అయితే నాుగు రీళ్లు చిత్రీకరణ జరిగిన తరువాత ఒక శుక్రవారం నాడు ఆమె షూటింగుకు ఆస్యంగా వచ్చారు ఆరోజున వరక్ష్మీ వ్రతం కారణంగా ఆస్యంగా వస్తానని ముందురోజే ఆమె ఓ చీటీ పంపారు. అయితే ఆ చీటీ చక్రపాణిగారి బ్‌లపై ఉండిపోయింది. ఎవ్వరూ దానిని చూడలేదు. భానుమతి ఆస్యాన్ని చక్రపాణి నిదీసి ప్రశ్నించారు. అలా ప్రశ్నించడం భానుమతికి సబబుగా తోచలేదు. ఆమెను క్షమాపణ చెప్పాని కోరినప్పుడు ఏ తప్పూ చేయకుండా తాను ఎందుకు క్షమాపణ చెప్పాంటూ ఆమె నిరాకరించారు. చక్రపాణి దీనిని అవమానంగా భావించారు. తక్షణమే ఆమెను తొగించి, ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం పూర్తిగా చెల్లించారు. అప్పటివరకు చిత్రీకరించిన నాుగు రీళ్ల ఫిలింనూ తగుబెట్టేశారు. ఆమె స్థానంలో సావిత్రిని తీసుకుని మళ్లీ మొదటినుంచి షూటింగ్ మొదు పెట్టారు. అలా భానుమతి స్థానంలోకి మిస్సమ్మగా విజయపథంలో దూసుకుపోయి అగ్రతారగా అరారారు.
‘మిస్సమ్మ’ చిత్రంలో సంగీతానికి కూడా చక్రపాణి బాధ్యత వహించారు. సంగీత దర్శకు రాజేశ్వరరావు గారికి ట్యూన్లు తృప్తి కలిగించలేదు. పాటు పాడిన పి.లీ అయితే ‘‘ఈ సారి పిక్చరుకైనా కాస్త మంచి పాటు పాడిరచండి’’ అని చక్రపాణితో అన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఎవరినోట విన్నా ‘మిస్సమ్మ’ పాటలే. చక్రపాణి గారికి ఇది ఊహించని విజయమని కొడవటి కుటుంబరావు వ్యాఖ్యానించారు. ‘మిస్సమ్మ’ కథ ఒక ప్రహసనం. కాని సంభాషణలోని హాస్యంతో, కథాగమనంలో చూపిన నైపుణ్యంతో ఒక సంఘటన తరువాత మరొకటి చకచకా జరిపించి, ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత చక్రపాణిది. ఈ చిత్రంతో హాస్యరసాన్ని అందంగా, అమోఘంగా యన్టీఆర్ పండిరచగరని మరోసారి రుజువుచేశారు. ‘‘చక్కని పాటు, మంచి సంగీతం, బమైన కథాంశం, మనోరంజకమైన సన్నివేశాు, వీటన్నిటినీ మిశ్రమంగా ప్రేక్షకుకు కనువిందు చేసిన మిస్సమ్మ లాంటి వినోదభరితమైన చిత్రాన్ని అప్పటివరకూ ఏ సంస్థ నిర్మించలేదనే చెప్పాలి’’ అని నాగిరెడ్డి చెప్పారు. వయోభేదం లేకుండా సినిమా చూసిన వారందరూ ఈ వ్యాఖ్యలో ఏమాత్రం అతిశయోక్తి లేదని ఆహ్లాదంగా ఒప్పుకుంటారు.
జూపిటర్ పిక్చర్స్ పతాకంపై ‘సంతోషం’ సినిమా తెరకెక్కింది. ఆ సంస్థతో యన్టీఆర్ అయిదు సినిమాు చేసేందుకు ఒప్పందం. దానిలో భాగంగా తొగులో ‘సంతోషం’, హిందీలో ‘నయా ఆద్మీ’ పేరుతో ఒకే సమయంలో రూపొందాయి. సీ.ఎన్.అన్నాదురై రాసిన వేలైకారి (1949) ఈ సినిమాకు మాతృక. ‘సంతోషం’, ‘నయా ఆద్మీ’ చిత్రాకు సీ.పీ.దీక్షిత్ దర్శకత్వం వహించారు. హిందీలో జగ్గయ్య స్థానంలో అన్వర్ హుస్సేన్, రేంగి స్థానంలో గోపే మినహా ఇందులో తారాగణం రెండు భాషల్లోనూ ఒకటే. రెండు భాషల్లోనూ హెలెన్ ఒక పాటకు నృత్యం చేసింది. 1955 డిసెంబరు 24 న ‘సంతోషం’ విడుద కాగా, ఒక వారం తర్వాత 1956 జనవరి 1న ‘నయా ఆద్మీ’ విడుదలైంది. రెండు చిత్రాూ విజయవంతమయ్యాయి. ‘నయా ఆద్మీ’ స్విర్ జూబ్లీ జరుపుకుంది. దాంతో యన్టీఆర్ కు హిందీ సినిమాలో నటించమని ఎన్నో మంచి అవకాశాు వచ్చాయి. కాని ఆయన హిందీ చిత్రసీమ వైపు మొగ్గుచూపలేదు.
ఏఎన్ఆర్’తో ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డి.ఎల్.నారాయణ గురజాడ అప్పారావుగారి కన్యాశ్కుం నాటకాన్ని తెరకెక్కించాని భావించి, అందులో గిరీశం పాత్రకు ఏఎన్నార్‌ను అడిగారు. గిరీశం నెగిటివ్ ఛాయున్న పాత్ర. ఏఎన్నార్ జంకారు. అప్పుడు ఆ పాత్ర కోసం యన్టీఆర్‌ను సంప్రదించారు. ఇమేజ్ గురించి పట్టింపులేని యన్టీఆర్ గిరీశంగా వేషం వేశారు. ‘కన్యాశ్కుం’ సినిమాలో మధుర వాణిగా సావిత్రి, బుచ్చమ్మగా జానకి, గిరీశంగా యన్టీఆర్ అద్భుతంగా నటించారు. తొలిసారి విడుదలైనప్పుడు ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు కానీ తరువాత రిలీజ్ అయినప్పుడు బాగా ఆడిరది.
హిందీ చిత్రం ‘ బాదల్ ’కు రీమేక్‌గా ‘జయం మనదే’ టి.ప్రకాశరావు దర్శకత్వంలో యన్టీఆర్, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాబిన్‌హుడ్ తరహాలో సాహసాను ప్రదర్శించేందుకు, మారువేషాు వేసేందుకు యన్టీఆర్ కు అవకాశం దక్కింది. యన్టీఆర్ కు, ప్రతినాయకుడిగా నటించిన ఆర్.నాగేశ్వరరావుకు మధ్య కత్తియుద్ధాు, కర్రసాము ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది రీమేక్ చిత్రమే అయినా ఘంటసా కకాం గుర్తుండిపోయే సొంత బాణీను అందించారు. 1956 మే 4 న విడుదలైన ‘జయం మనదే’ ఘన విజయం సాధించి 11 కేంద్రాల్లో 100 రోజు ఆడిరది.
ఏఎన్నార్, యన్‌టిఆర్, సావిత్రి, అంబరీదేవి నటించిన ‘చరణదాసి’ చిత్రాన్ని టి. ప్రకాశరావు దర్శకత్వంలో శంకరరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రావణ సంహారం తర్వాత సీతను చేపట్టేందుకు రాముడు నిరాకరించడం, ంకలో రావణుని చెరలో ఉన్న సీత శీలాన్ని రాముడు శంకించడం వంటి సన్నివేశాతో ఒక సుదీర్ఘమైన స్వప్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. అపనిందను భరించలేక సీత అగ్నిప్రవేశం చేసి పునీతగా తిరిగి వస్తుంది. ఆ సన్నివేశం తరువాత సీతారాముకు ఒక యుగళ గీతం ఉంది. శ్రీరాముడుగా యన్టీఆర్ కనిపించిన మొట్టమొదటి చిత్రం ఇదే. ఈ సినిమాలో సీతారాము పాత్రల్లో కనిపించిన అంజలీదేవి, యన్టీఆర్ తోనే 1969 ఫిబ్రవరి 6 వ తేదీన ‘వకుశ’ చిత్రాన్ని శంకరరెడ్డి ప్రారంభించారు. ‘వకుశ’ చిత్రంలో శ్రీరామునిగా యన్టీఆర్ మేకప్‌కు ‘చరణదాసి’ చిత్రంలోని మేరకు స్పష్టమైన పోలికున్నాయి.
హిందీలో దిలీప్ కుమార్ నటించిన ‘మేలా’చిత్రం ఆధారంగా ‘చిరంజీవు’ సినిమా తెరకెక్కింది. ‘మేలా’ను మక్కీకి మక్కీగా కాక, నిర్మాత డి.ఎల్.నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య కోరికపై రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రిగారు మార్పు చేర్పు చేసి కథను పటిష్టంగా అల్లారు. ఇందులో యన్టీఆర్ ఒక అంధుడి పాత్ర పోషించారు. అంధుడిగా అగుపించడానికి ఏదో ద్రావకం చుక్కు ఆయన కళ్లలో వేశారు. ఆ ద్రావకం వ్ల యన్టీఆర్ కళ్లలో దురదు, మంటు పుట్టాయి. చూపు ఆనలేదు. వృత్తి పట్ల యన్టీఆర్ అంకితభావం ప్రదర్శిస్తూ, మంటను, బాధను పంటి బిగువున భరించి, కానరాని కళ్ళతో, ఒక్క మాటకూడా ఎవరినీ అనకుండా నటించారు. పాత్ర పండడం కోసం ఆయన ఏమైనా చేసేవారు, ఏదైనా భరించేవారు.
‘చిరంజీవు’ చిత్రానికి పాట రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి వారి అచ్చమైన తొగు పాటు ‘త్లెవార వచ్చె తెలియక నాస్వామి …..’ ‘కనుపాప కరమైన కనులెందుకో .. ’ మాత్రమే కాక సినిమాలో అన్ని పాటూ ఆణిముత్యాలే.
‘చిరంజీవు’ విజయవంతమైన సినిమా.
ఒక అంధుడు జీవితంపై విరక్తి చెంది రౖుె కిందపడి ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుని, చెంగ్పట్టు రైల్వే స్టేషన్ సమీపంలోని రౖుె పట్టాపై నడుస్తున్నాడు. వేగంగా రౖుె వస్తోంది. కొంత దూరంలో పట్టాపై నడుస్తున్న వ్యక్తిని చూసి, అతనిని రక్షించాని ఇంకొక వ్యక్తి పరుగెడుతూ, తొట్రుపాటుకు లోనయ్యాడు. కానీ అతను అంతలో తేరుకుని పైకిలేచి పరుగెడుతూ రౖుె ఆ గుడ్డివాళ్లి సమీపించి ఢీకొట్టే సమయానికి సరిగ్గా కొద్ది క్షణా తేడాతో ఆ మనిషిని చేరుకుని, పట్టా మీద నుంచి లాగి రక్షించాడు.
‘చిరంజీవు’ చిత్రంలోని ఈ కీకమైన సన్నివేశంలో అంధుడి పాత్రలో యన్టీఆర్, ఆయనను రక్షించే పాత్రలో గుమ్మడి నటించారు. అయితే యన్టీఆర్ ను కాపాడేందుకు పరిగెత్తే క్రమంలో గుమ్మడి తొట్రుపాటు స్క్రిప్టులో లేదు. రౖుె వచ్చేస్తోందన్న ఆత్రుతలో పరుగెత్తుతూ గుమ్మడి అదుపు తప్పి తొట్రుపడ్డారు. అదృష్టవశాత్తూ ఆయన నిదొక్కుకుని, మళ్ళీ పరుగు ంకించుకున్నారు. సరిగ్గా ఆ రౖుె యన్టీఆర్‌ను తాకడానికి కొన్ని సెకన్ల ముందు అక్కడకు చేరుకుని పట్టా మీద నడుస్తున్న యన్టీఆర్‌ను పక్కకు తోశారు. ఇంకొద్ది క్షణాకు రౖుె పట్టాపై వేగంగా వెళ్ళిపోయింది.
తన సహజ ధోరణిలో అంధుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన యన్టీఆర్ గుమ్మడి కింద పడిరది, రౖుె దగ్గరలో వస్తున్నది గమనించలేదు. ఆ సన్నివేశాన్ని తచుకున్నప్పుడల్లా తనకు వెన్నులోంచి వొణుకు పుడుతుందని గుమ్మడి చెప్పేవారు. ‘‘నేను తొట్రుపడి లేచే క్రమంలో ఒక రెండు క్షణాు ఆస్యమయితే ఎంత అనర్థం జరిగి ఉండేదో అని ఊహించడానికే గగుర్పాటుతో గుండె జదరిస్తోంది’’ అని గుమ్మడి అన్నారు. యన్టీఆర్ తన పాత్రల్లో ఎంతగా మమేకమై నటించేవారో ఈ సంఘటన తొపుతుంది.
జనవరి 1956 లో విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’ యన్టీఆర్ నటజీవితంలో మరో మైురాయి. ఈ చిత్రంలో ఆయన తొలిసారిగా శ్రీకృష్ణదేవరాయుగా నటించారు. యన్టీఆర్, ఏఎన్ఆర్, భానుమతి కలిసి నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో తెనాలి రామకృష్ణుడిగా ఏఎన్నార్ నటన అద్వితీయం.
‘తెనాలి రామకృష్ణ’ తొగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రాష్ట్రపతి రజత పతకాన్ని గొచుకుంది. ‘శివాజీ గణేశన్ తెనాలి రామకృష్ణ’ పాత్రను పోషించగా తమిళంలోనూ ఈ సినిమా ఏకకాంలో తెరకెక్కింది తమిళ చిత్రంలో కూడా శ్రీకృష్ణదేవరాయు పాత్ర యన్టీఆర్ పోషించారు.
1956 వ సంవత్సరం యన్టీఆర్ నటజీవితంలో ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ ఏడాది అమర గాయకుడు ఘంటసా నిర్మించిన ‘సొంతవూరు’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఒక అంతర్నాటకంలో యన్టీఆర్ శ్రీకృష్ణుడి వేషంలో కనిపిస్తారు. అప్పటివరకు ఈపాట రఘురామయ్య గారిని కృష్ణుడుగా చూసి అవాటుపడిన ప్రేక్షకు శ్రీకృష్ణుడిగా యన్టీఆర్ ను అంగీకరించలేదు. శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన తెరమీదకు రాగానే ప్రేక్షకు పిల్లికూతు కూసి, నానా అ్లరి చేశారు. అన్ని రకా పాత్రను పోషించి, అపూర్వ విజయాన్ని సాధించిన యన్టీఆర్ కు ఇలాంటి చేదు అనుభవం అనూహ్యం. ఇంతకు మునుపు ‘ఇద్దరు పెళ్లాు’ సినిమాలో కూడా ఒక యుగళ గీతంలో కొద్దిసేపు శ్రీకృష్ణుడిగా యన్‌టిఆర్ కనిపిస్తే ప్రేక్షకు తిరస్కరించారు. ఈ రెండు చిత్రా చేదు అనుభవంతో విజయా ప్రొడక్షన్స్ వారు ‘మాయాబజార్ ’ సినిమాలో పూర్తి నిడివి శ్రీకృష్ణుడి పాత్రను వేయమని కోరినప్పుడు ఆయన సుముఖంగా లేరు.
(కె. చంద్రహాస్ ` కె. క్ష్మీనారాయణ రచనలో మెవడిన
‘యన్.టి.ఆర్. సమగ్ర జీవిత కథ’ పుస్తకం నుండి.
ఫోన్: 8008 44 9678 )