అమెరికా లాంటి అగ్రరాజ్యంలో తెలుగుపూల పరిమళాన్ని పంచుతున్న కుటుంబాల్లో ఉప్పలపాటి కుటుంబం ఒకటి. ఉప్పలపాటి సుబ్బారావు-ఝాన్సీరాణి దంపతుల ఇద్దరు కుమారులు సునీల్-శ్రీదేవి; సుహాస్-మధురిమ దంపతుల కుటుంబాలు రెండూ అమెరికాలో స్థిరపడ్డాయి. ఇప్పుడు వీరి సంతానం అమెరికాలో విద్యాకుసుమాలు పూయిస్తూ సౌరభాలను వెదజల్లుతోంది. సునీల్-శ్రీదేవి దంపతుల కుమార్తె సితార చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ మేటిగా నిలుస్తూ మన్ననలు అందుకుంటున్నారు.
సుహాస్-మధురిమ దంపతుల కుమార్తెలు రియా, ఈషాలు అమెరికాలో ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించారు. చదువుల్లో మేటిగా నిలుస్తూ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఆటపాటల్లోనూ తమకు తామే సాటి అనిపించుకున్నారు. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇప్పుడు సునీల్-శ్రీదేవి దంపతుల కుమార్తె అయిన సితార కూడా చదువులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ, అతి కొద్దిమందికే సాధ్యమైన వాటిని అలవోకగా అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.
సరస్వతీ పుత్రిక
సునీల్-శ్రీదేవి దంపతుల కుమార్తె సితార కూడా సరస్వతీ పుత్రికే. చదువులో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అమెరికాలోని నంబర్ వన్ స్కూల్ అయిన వర్జీనియా రాష్ట్రంలోని థామస్ జెఫర్‌సన్ స్కూల్‌లో సీటు సంపాదించింది. ఐఐటీ కంటే ఎక్కువ ప్రమాణాలు కలిగిన ఈ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసిన సితార టెక్సాస్ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. కంప్యూటర్స్ అండ్ బిజినెస్ (డ్యూయల్ డిగ్రీ) చదువుతున్న సితార ఫస్ట్ ఇయర్ డిగ్రీ పూర్తి చేసింది. డ్యూయల్ అండ్ ఆనర్స్ డిగ్రీలో టెక్సాస్ యూనివర్సిటీ అమెరికాలో అగ్రగామి. సితార తమ్ముడు సూరజ్ థామస్ జెఫర్‌సన్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. వీరందరు ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలోనే అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు అందుకున్నారు.
సెకండ్ ఇయర్‌లోనే ప్రాజెక్ట్
సితార డ్యూయల్ డిగ్రీలో సీటు సంపాదించడమే గొప్ప విషయమైతే, రెండో ఏడాదిలోనే ప్రాజెక్ట్ సంపాదించడం మరో గర్వకారణమైన విషయం. అదొక్కటే కాదు, రెండో ఏడాది మూడో సెమిస్టర్‌లో ఉండగానే ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఉన్న గూగుల్, అమెజాన్‌లలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక కావడం ఆమె ప్రతిభకు తార్కాణం. నిజానికి చివరి ఏడాదిలోనే ప్రాజెక్టులు ఇస్తారు. అయితే, మెరిట్ స్టూడెంట్స్‌కు మాత్రమే రెండో ఏడాదిలో ఇస్తారు. తన ప్రతిభతో సితార సెకండ్ ఇయర్‌లోనే ప్రాజెక్టు సంపాదించి గర్వకారణంగా నిలిచింది.
సెనేటర్లతో సమావేశం
థామస్ జెఫర్‌సన్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ బోర్డులో ఒకరిగా ఉన్న సితార రిచ్‌మండ్‌లో సెనేటర్లతో జరిగిన సమావేశంలోనూ పాల్గొంది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. సితార ప్రతిభకు మెచ్చిన ఓ యూనివర్సిటీ ఫీజు మాఫీ చేసి ఉచితంగా విద్య అందిస్తామని చెప్పినప్పటికీ ఆమె మాత్రం టెక్సాస్ యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులో చేరేందుకే మొగ్గు చూపింది.
అద్భుతాల సృష్టికర్త
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తున్న ‘ఇండియన్ కల్చర్ అసోసియేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ’కి సితార ఎంపిక కావడం విశేషం. చదువుతోపాటు సైన్స్ ఫెస్టివల్స్, డిబేట్స్, డ్యాన్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లలో చురుగ్గా ఉండే సితార భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సితార సాధిస్తున్న విజయాలకు ఆమె తాతయ్య ఉప్పలపాటి సుబ్బారావు, నాయనమ్మ ఝాన్సీరాణి ఉప్పొంగిపోతున్నారు. ఇండియన్ కల్చర్ అసోసియేషన్ ‘ఝలక్ బోర్డ్’ 2020 స్ట్రాటజిక్ సభ్యురాలిగా సితార ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
సితార తల్లిదండ్రుల గురించి..
సితార తల్లిదండ్రులు సునీల్- శ్రీదేవి. వీరు 1997లోనే అమెరికాలో స్థిరపడ్డారు. ఎంఎస్ పూర్తిచేసిన సునీల్ అక్కడి ఫెడరల్ ప్రభుత్వ పేటెంట్స్‌లో సీనియర్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్)గా పనిచేస్తున్నారు. ఎంఎస్ చేసిన శ్రీదేవి వర్జీనియాలోని మ్యాన్‌టెక్ కంపెనీలో ఐటీ టెస్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
మొబైల్: 99490 32911