Uncategorized

ramudu1

రాముడంటే రామారావే!

యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం […]

రాముడంటే రామారావే! Read More »

ntr12

సంక్షేమంలో స్వర్ణయుగం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ఎన్.టి. రామారావు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. మూడు సార్లు తన రికార్డును తానే అధిగమించి ప్రతి సారీ మూడొంతుల మెజారిటీతో గెలిచి, కేవలం ఏడున్నర సంవత్సరాలు మాత్రమే పాలించిన నాయకుడు ఎన్టీఆర్. ప్రజాకర్షణలో శ్రీమతి ఇందిరాగాంధీ తరువాత ఆయనదే ద్వితీయ స్థానం. రామారావు సంప్రదాయక రాజకీయ నాయకుడు కాదు. కుళ్ళు, కుతంత్రం తెలియని ఏకైక రాజకీయ నాయకుడుగా ఆయన చరిత్రకెక్కారు. అధికారానికి వచ్చినప్పుడు పరిపాలనానుభవం శూన్యం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన పాలనా కాలమే

సంక్షేమంలో స్వర్ణయుగం Read More »

prf

మిజోరం యూనివర్సిటీని మరోస్థాయికి తీసుకెళ్తున్న ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు

గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ క్రొత్తపల్లి రాజసూర్య సాంబశివరావు వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న మిజోరం యూనివర్సిటీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ తాజాగా విడుదల చేసిన ‘ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2021’లో మిజోరం యూనివర్సిటీకి ప్రపంచస్థాయిలో 601-800 ర్యాంకు లభించింది. దేశంలోని మొత్తం 49 యూనివర్సిటీలకు ఈ ర్యాంకింగ్స్‌లో స్థానం లభించగా, మిజోరం వర్సిటీకి 21వ స్థానం లభించడం విశేషం. అంతేకాదు, ఈశాన్య భారతదేశంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

మిజోరం యూనివర్సిటీని మరోస్థాయికి తీసుకెళ్తున్న ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు Read More »

G

ఐదు రూపాయలు వసూలైతే కానీ భోజనం చేయనని భీష్మించుకున్నాం – గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చక్కని స్ఫూర్తికాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం. చెరుకువాడ వెంకట నరసింహంగారి మాతామహు స్థానం మా

ఐదు రూపాయలు వసూలైతే కానీ భోజనం చేయనని భీష్మించుకున్నాం – గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

MD

రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం

భారత రాజకీయాలను పరికించి చూస్తే ఇటీవల ఓ కొత్త విషయం అర్థమవుతోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాత్రంత్యం క్రమంగా మట్టిలో కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకున్న భరతమాత తిరిగి నియంతృత్వం చేతుల్లోకి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. అసమ్మతి గళం వినిపించినా, విమర్శలు చేసినా ప్రభుత్వాలకు ఎందుకనో రుచించడం లేదు. ఎలాంటి జంకూగొంకు లేకుండా విమర్శలు చేస్తున్న వారిపై దేశద్రోహం (రాజద్రోహం) కేసులు పెట్టి అరెస్టులు చేసి విచారణ పేరుతో కోర్టులు చుట్టూ తిప్పుతూ నానా హింసలు

రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం Read More »

ch

చనిపోయిన వ్యక్తిలో కరోనా వైరస్ సజీవంగా ఉంటుందా?

ఏ ముహూర్తాన అయితే కరోనా వైరస్ ఈ భూమ్మీద అడుగుపెట్టిందో కానీ అప్పటి నుంచి బంధాలు, బంధుత్వాలు మాయమయ్యాయి. ఆత్మీయ సంభాషణలు, పలకరింపులు దూరమయ్యాయి. మన ఆత్మీయులో, స్నేహితులో దూరమైతే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేవాళ్లం. తామున్నామంటూ వారిలో భరోసా నింపేవాళ్లం. దీంతో వారు ఆత్మీయులను కోల్పోయిన బాధ నుంచి త్వరగా బయటపడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. పలకరింపులు లేవు, పరామర్శలు లేవు. మన సొంతవారు దూరమైనా సరే దగ్గరకు వెళ్లేందుకు జంకుతున్నారు. కరోనా భయంతో

చనిపోయిన వ్యక్తిలో కరోనా వైరస్ సజీవంగా ఉంటుందా? Read More »

ps

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు రాష్ట్రపతి చేతుల మీదగా సత్కారం పొందుతున్న పావులూరి శివరామకృష్ణయ్య ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య(98) కన్నుమూశారు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. అమర్తలూరు మండలం గోవాడలో ఆయన జన్మించారు. ప్రాథమిక విద్య గోవాడలో, ఉన్నతవిద్య తీరుమెళ్ల, మెట్రిక్యులేషన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గాంధీ ఆశయాలకు ఆయన ప్రభావితుడయ్యారు. వార్దా సేవాగ్రామ్‌లో 1934లో ఏడాది పాటు గాంధీకి సేవలందించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు Read More »

ab

రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య

రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య దుమ్మెత్తి పోసుకోవడం, శ్రుతి మించి తిట్టుకోవడం, అందినంత దోచుకోవడం.. ఇవీ నేటి రాజకీయాల తీరు. ప్రజాసేవకు నేరుగా ఉన్న ఈ గొప్ప మార్గం ఎలా దుర్వినియోగం అవుతున్నదీ తెలంగాణ అభ్యుదయవాది చేకూరి కాశయ్య కన్నుమూత మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత చేకూరి కాశయ్య మే 25న అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి

రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య Read More »

ntr-2

నటరత్న రెండు చిత్రాలు…మరపురాని చరిత్ర!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారకరామారావు అంటేనే ఓ సంచలనం! ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమారంగంలో కానీ నందమూరి బాటనే పలువురు అనుసరించారు. అనుసరిస్తున్నారు. భవిష్యత్ లోనూ అనుసరించబోతారు. ఇందులో ఏలాంటి సందేహమూ లేదు. చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ యన్టీఆర్ సాధించిన అరుదైన విజయాలను తలచుకుంటేనే మది పులకించిపోతూఉంటుంది. అదే పనిగా చరిత్ర సృష్టించాలని యన్టీఆర్ ఏ నాడూ ఏ పనీ చేయలేదు. ఆయన పూనుకున్న కార్యం విజయవంతమయ్యాకే ఓ

నటరత్న రెండు చిత్రాలు…మరపురాని చరిత్ర! Read More »