యన్‌టిఆర్‌ రాయసీమకు చేయూత

nt

1952లో తొగు చిత్రసీమ అనే సినీ పత్రిక పాఠకు ప్రశ్ను పంపితే వాటికి యన్‌టిఆర్‌ స్వయంగా సమాధానమిస్తారని ఒక ప్రకటన విడుద చేసింది. ప్రకటన మెవడగానే ఆ పత్రిక కార్యాయానికి ఉత్తరాు మ్లెవెత్తాయి. అపూర్వమైన ఆ స్పందన యన్‌టిఆర్‌ పాపులారిటీకి అద్దం పట్టింది. ప్రతి ఉత్తరానికి యన్‌టిఆర్‌్‌ సమాధానమివ్వడం, వాటన్నిటినీ పత్రికలో ముద్రించడం సాధ్యపడే విషయంలా కనిపించ లేదు. అందుకని ఆ పత్రిక సంపాదకుడు ఉత్తరా న్నింటినీ అంశా వారీగా విభజించి అందరూ సాధారణంగా అడిగిన ప్రశ్ను కొన్నింటిని సమీకరించారు. ఆ ప్రశ్నకు జవాబివ్వాల్సిందిగా యన్‌టిఆర్‌ కోరారు.
జవాబును యన్‌టిఆర్‌ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఆ పత్రిక ఆయన చేతిరాతలోనే ప్రచురించింది. మీరు సినీ పరిశ్రమకు వచ్చినది కళకోసమా లేక డబ్బుకోసమా అని ఒక ప్రశ్న. సినిమా కళకు సంబంధించిన వ్యాపారమని, నటు కూడా ఆ వ్యాపారంలో భాగస్వాముని యన్టీఆర్‌ సమాధానమిచ్చారు. కళ దేశం కోసం, సమాజం కోసం అని చెప్పారు. కళాజీవితం వ్యాపారం కోసం మాత్రమే కాకూడదు. ‘‘భూకం పాు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు బాధితు కన్నీళ్లు తుడవడానికి బళ్లారి రాఘవ, పృథ్వీరాజ్‌ కపూర్‌ వంటి కళాకాయి వారి వంతు కృషి చేస్తున్నారు’’ అన్నారాయన. చివరగా ఇంతవరకు తన కళా జీవితాన్ని సమాజ హితం కోసం ఉపయోగించ లేకపోయానని అన్నారు.
ప్రజాహితమే కళకు క్ష్యమని ప్రఖ్యాత జర్నలిస్ట్‌, రచయిత, ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకుడు అయిన నార్ల వెంకటేశ్వరరావు యన్‌టిఆర్‌కు ఉద్బోధ చేశారు. సమాజంలో సంక్షోభ పరిస్థితు ఏర్పడినప్పుడు కళాకాయి ప్రజతో మమేకమై పనిచేయవసిన అవసరం ఉందని సూచించారు. 1952లో రాయసీమ అంతటా కరువు పరిస్థితు నెకొన్నాయి. నార్ల వారు ఆంధ్రప్రభ రాయసీమ క్షామ నివారణ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధికోసం చందాు సేకరిస్తున్నప్పుడు కళాకారు తరఫున తమ వంతుగా నిధికి సహాయపడాని యన్‌టిఆర్‌ నడుం కట్టారు.
విజయా ప్రొడక్షన్స్‌ వారి ‘చంద్రహారం’ సినిమా అప్పుడు సెప్పి ఉంది. షూటింగ్‌ షెడ్యూల్లో వచ్చిన విరామంలో రాష్ట్రమంతా తిరిగి కరవు బాధితు సహాయార్ధం విరాళాు సేకరించాని యన్‌టిఆర్‌ నిర్ణయించుకున్నారు. తన పిుపుకు అప్పటి స్టార్‌ హీరోయిన్‌ జి.వరక్ష్మి నటు గుమ్మడి, పేకేటి శివరాం, దర్శకుడు మధుసూదన రావు, ఆయన భార్య సరోజిని, కమకుమారి తదితయి స్పందించి విరాళాు సేకరించే బృందంలో చేరారు. త్రివిక్రమరావు, పుండరీ కాక్షయ్య కార్యక్రమానికి నిర్వాహకుగా వ్యవహరించారు. రౖుె ప్రయాణం ఆరోజుల్లో విలాసవంతమైనదిగా పరిగణించేవారు. బిచ్చమెత్తేవారు విలాస ప్రయాణాు చేయటం సబబు కాదని అంజలీ పిక్చర్స్‌, రాజ్యం పిక్చర్స్‌ వారి రెండు వ్యాన్లను, దోనేపూడి కృష్ణమూర్తి, జి.వరక్ష్మి గారి కార్లను ఆ బృందానికి సమకూర్చారు. ఒక బస్సులో డ్రైవర్‌ పక్కనున్న సీట్లో యన్టీఆర్‌ కూర్చునేవారు.
జి. వరక్ష్మి ఆ జ్ఞాపకాను నెమరేసుకుని, అప్పుడు తమతో బయుదేరిన వి.మధుసూదన రావు, సరోజిని దంపతు ఔన్నత్యాన్ని తచుకున్నారు: ‘‘వాళ్ళ రెండో బిడ్డకు సంవత్సరం వయసు. ఆ బిడ్డ చావు బ్రతుకుతో పోరాడే పరిస్థితిలో ఉంది. వారు ఆ బిడ్డను హాస్పిటల్లో వేసి బ్రతికితే మేము వచ్చి తీసుకుంటాము. ఇప్పుడు మేము చాలా ముఖ్యమైన పనిమీద ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు బయుదేరిపోతున్నాము అని చెప్పి వచ్చి బృందంలో చేరిపోయారు. ‘చావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను హాస్పిటల్లో వేసి బయుదేరిన మీరు తల్లిదండ్రులా’ అని నేను ప్రశ్నించాను. అప్పుడా దంపతు నన్ను చూచి ‘ఇన్ని రోజు రిహార్సు చేసి ఇప్పుడు మానితే ఇంత తక్కువ వ్యవధిలో మరొకర్ని చూసుకోవడం సాధ్యం కాదుగదా. అందువ్ల మొత్తం పర్యటన కార్యక్రమం దెబ్బ తింటుంది. అదీగాక ఇలా ప్రతి ఒక్కరూ నేనూ నా బిడ్డా అనుకుంటే ఇక దేశమూ, ప్రజు అనుకునేది ఎవరు? అక్కడ కరువుకు గురై ఎందరు త్లు, బిడ్డ కొరకు అల్లాడుతున్నారో? వాళ్ళలో కొద్దిమంది కన్నీళ్ళు తుడవగలిగినా మా బిడ్డ బ్రతికినట్టే’ అని చెప్పారు. మా వెంట బయల్దేరిన మధు దంపతు ఆ క్షణంలో నాకు ఆది దంపతుగా కనిపించారు’’.
యన్‌టిఆర్‌ పిుపు మహిమ అది.
ఆ బృందం రాష్ట్రమంతటా 1952 ఏప్రిల్‌ నెలో 22 రోజుపాటు పర్యటించింది. రెండు నాటకాు ప్రదర్శించింది. త్రిపురనేని గోకుల్‌ చంద్‌ రచించిన ‘కరువు రోజు’ నాటకంలో యన్టీఆర్‌ ప్రధాన పాత్రను, గుమ్మడి రైతు పాత్రను పోషించారు. నాటికలో యన్‌టిఆర్‌కు ఎం.ఎస్‌.రామారావు నేపథ్యగానం చేశారు.
రాయు ఏలిన ఆ దేశంలో
రతనాల్‌ పండిన ఆ భూముల్లో
కరువు పిశాచం గజ్జెకట్టుకుని
కదననృత్యం చేస్తుంటే…
వినండి బాబూ విషాద గాథ
వినరయ్యా ఈ కరువుకథ…
ఇలాంటి పాటు ఎం.ఎస్‌.రామారావు పాడితే శ్రోత హృదయాు కరిగిపోయేవి.
రెండు నాటకా విరామ సమయంలో యన్టీఆర్‌, వరక్ష్మి ప్రజ వద్దకు జో పట్టుకుని కడుపు తరుక్కుపోయే విధంగా బిచ్చమెత్తారు. ఆంధ్రలో అన్ని ముఖ్య పట్టణాకు ఇదేవిధమైన కార్యక్రమం నిర్వహించడం ఆ రోజుల్లో సెన్సేషన్‌ సృష్టించింది. అటునుండి కార్యక్రమం గతంలో ఎవరూ చేపట్టలేదు. ఆబాగోపాలాన్నీ రంజింప చేసే కళాకాయి అలా తమ దగ్గరకు వ్యక్తిగతంగా రావడం ప్రజను విపరీతంగా ఆకర్షించింది. వాళ్లు తమ తారను చూడడానికి ఎగబడ్డారు. వారితో కరచానం చేయడానికి, వారిని ముట్టుకుని ఇదంతా నిజమే, కకాదని తొసు కోవడానికి చాలా ఉత్సాహం చూపించారు. కష్టాలెరుగని తారు ప్రజ కష్టాకు చలించి జోలి పట్టుకునేంతటి ప్రజా సేవాసక్తిని వారిలో చూస్తున్న ప్రేక్షకు కంటనీరు పెట్టారు. ఈ కార్యక్రమంలో మొత్తం ఒక క్షా ఇరవై వే రూపాయు డబ్బు సేకరించారు. 1950వ దశకంలో ఆ సొమ్ము తక్కువేం కాదు.
సినిమా నటుడుగా ప్రజ వద్దకు వెళ్ళినదానికి, ప్రజా సంక్షేమం కోసం ప్రజలో ఒకడుగా వెళ్ళినదానికి ఎంతో తేడా ఉందని యన్‌టిఆర్‌్‌ గ్రహించారు. మేము పాతాళభైరవి శత దినోత్సవా సందర్భంలోనూ, స్విర్‌ జూబిలీ సందర్భంలోనూ సినిమానటు హెదాతో ప్రజ దగ్గరికి వెళ్ళాము. మాకు ముందూ వెనకా పోలీసు బందోబస్తు కావసి వచ్చింది. ప్రజు మామీద దొమ్మీ చేశారు. మమ్మల్ని కిరాయి వ్యక్తులే పాటు పాడమన్నారు. ఈసారి బిచ్చగాళ్లలా ప్రజ మధ్యకు వెళ్లాం. ఒంటి ఆడకూతురు వరక్ష్మి నడివీధిలోకి జోలె పట్టుకు వచ్చింది. మాకు ఏ బందోబస్తు లేదు. ఎవరూ దొమ్మీ చేయలేదు. తృణమో పణమో ఇచ్చారు. మమ్మల్ని తమ ఆప్తుగా చూసుకున్నారు’’ అన్నారు యన్టీఆర్‌.
నె రోజు పర్యటన తరవాత, సేకరించిన డబ్బుని వాణీమహల్లో ఒక కార్యక్రమం నిర్వహించి నాగిరెడ్డిగారి చేతు మీదుగా ఆంధ్రప్రభ రాయసీమ కరువు నివారణ నిధికి అందజేయాని సంకల్పించారు. అందుకోసం నాగిరెడ్డిగారి అనుమతి కోసం యన్టీఆర్‌ వెళ్లారు. పర్యటన గురించి ముందుగా తనతో మాటమాత్రం కూడా చెప్పలేదని నాగిరెడ్డి గారికి కోపం. ‘‘విరాళా సేకరణకు వెళ్లేముందు మీరు ఎవరి అనుమతి తీసుకున్నారు?’’ అని కటువుగా అడిగారాయన. ఈ ప్రశ్నకు నిరత్తరుడైన యన్‌టిఆర్‌ తనపై నాగిరెడ్డిగారు పెత్తనం చెలాయిస్తున్నారని అర్థమయింది. అప్పటికి యన్‌టిఆర్‌ విజయా ప్రొడక్షన్స్‌ కాంట్రాక్టుకు లోబడి ఉన్నారు. నాగిరెడ్డిగారి మాటు యన్‌టిఆర్‌ సున్నిత హృదయాన్ని గాయపరిచాయి. ఆయన అహం తీవ్రంగా దెబ్బతింది. కోపావేశం కట్టు తెంచుకుంది. ‘‘బిచ్చమెత్తడానికి కూడా మీ అనుమతి కావాంటే, మీ ఉద్యోగం నాకు అక్కర్లేదు’’ అని చెప్పి యన్‌టిఆర్‌ విసురుగా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి బయటపడ్డ తరువాత స్టూడియోలో మళ్లీ కాు పెట్టకూడదని అనుకున్నారు. ఆ సంఘటన జరిగిన దరిమిలా యన్టీఆర్‌ స్టూడియోకి వెళ్ళలేదు. విజయా ప్రొడక్షన్స్‌ కూడా ఆయన్ని స్టూడియోకు రమ్మని కబురు చేయలేదు.
కొన్ని రోజు ప్రతిష్టంభన కొనసాగింది. ఎల్‌.వి.ప్రసాద్‌ గారికి విషయం తెలిసింది. యన్టీఆర్‌కు నాగిరెడ్డికి మధ్య తగవు
ఉభయభ్రష్టత్వానికి దారితీస్తుందని ఆయన భావించారు. అది సినిమా పరిశ్రమకు కూడా చేటు అని ఆలోచించి, వాళ్లిద్దరి మధ్య సయోధ్య నెకొల్పాని ప్రయత్నం చేశారు. ఆయన కృషి ఫలించింది. భేషజాకు పోకుండా, ఇద్దరూ ఒక మెట్టు దిగి వచ్చారు. తనపట్ల నాగిరెడ్డి మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారనే హామీ తీసుకున్న మీదట యన్టీఆర్‌ స్టూడియోకు వెళ్లారు. నాగిరెడ్డిగారు ద్వారం వద్ద నిబడి ఆయనకు సాదరంగా స్వాగతం చెప్పారు. జరిగిన సంఘటనను ఇద్దరూ మరిచిపోయారు.

nt1
‘చంద్రహారం’ సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైంది.
(కె. చంద్రహాస్‌ ` కె. క్ష్మీనారాయణ రచనలో మెవడిన ‘యన్‌.టి.ఆర్‌. సమగ్ర జీవిత కథ’ పుస్తకం నుండి. ఫోన్‌: 8008 44 9678)

Share: