ప్రఖ్యాత వ్యవసాయవేత్త

V

డా॥ కొసరాజు తిరుమరావు ఇకలేరు
తన జీవితాంతం ఆర్యసమాజ్‌ సిద్ధాంతాను నమ్ముకుని తన నిత్య జీవితంలో ఆ సిద్ధాంతానే ఆచరించిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. ఆర్య పురుషు బిరుదాంకితు డా॥ కొసరాజు తిరుమరావు తన 86వ యేట జూన్‌ 30న తుదిశ్వాస విడవటం వారి కుటుంబ సభ్యునే కాక బంధువును, స్నేహితును, శ్రేయోభిలాషును శోక సముద్రం ముంచింది.
డా॥ తిరుమరావు కృష్ణా జిల్లా కురుమద్దా గ్రామానికి చెందిన కొసరాజు వెంకట్రామయ్య, అన్నపూర్ణమ్మ దంపతుకు 1935లో న్గావ కుమారునిగా 8వ సంతానంగా జన్మించారు. వీరు తాడంకి హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేసి బందరు నేషనల్‌ కళాశాలో ఇంటరు, బాపట్ల వ్యవసాయ కళాశాలో బియస్‌సి చదివి వ్యవసాయ శాఖలో డిమాన్‌స్ట్రేటర్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించి ఉయ్యూరు, గద్వా మరియు అనేక ఇతర ప్రదేశాలో విధు నిర్వహించి ఆయా ప్రాంతాలో రైతుకు అధిక పంటను గురించి, పంటకు సంక్రమించే తెగుళ్ళను గురించి మొకుమ నేర్పించారు. గ్రాడ్యుయేషన్‌ చదువుతో సంతృప్తి చెందక, కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాయంలో యం.యస్‌.సి. ఉత్తీర్ణులై రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌)లోని ఆచార్య యన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాయంలో ఆచార్యునిగా చేరారు. కొంత కాలానికి పి.హెచ్‌.డి చేయానే తన కోర్కెను విశ్వవిద్యాయ అధికారుకు తెలియచేయగా వారిని ఢల్లీి పూసా ఇన్‌స్టిట్యూట్‌ (ఇండియన్‌ అగ్రిక్చరల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)లో కీకట శాస్త్రంలో పి.హెచ్‌.డి. చేయటానికి విశ్వవిద్యాయం వారే పంపించారు.
డాక్టర్‌ కొసరాజు తిరుమ రావు గారు వ్యవసాయ శాస్త్రంలో పి.హెచ్‌.డి పట్టా న్యూఢల్లీి ఐ.ఎ.ఆర్‌.ఐ. నుండి పొంది ప్రొఫెసర్‌గా బాపట్ల వ్యవసాయ కళాశా లో 1997 సం! పదవీవిరమణ చేశారు. ఆయన 1976 లో పతంజలి ఇంటర్నేషనల్‌ యోగా ఇన్స్టిట్యూట్‌ బాపట్లలో స్థాపించి ఎంతోమందికి యోగా నేర్పించారు. ఆయన గుంటూరు జిల్లా యోగా కాంపిటీషన్స్‌కి జడ్జిగా ఉండేవారు. గత 40 సం॥గా గుంటూరు ఆర్య సమాజం అధ్యక్షుగా ఎనలేని సేమ అందించారు. పదవీవిరమణ చేసిన తరువాత కొచ్చర్ల లో దయానందాశ్రమం నెకొల్పి వినుకొండ తాూకాలో వేద ధర్మ ప్రచారం గావించారు. య్ఞశా, గోశా ఏర్పరచి, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ని ప్రోత్సాహించారు. వర్షేష్టి యజ్ఞాు నిర్వహించి వర్షాు కురిపించారు. ఆయనకు అభినవ వర్షేష్టి బ్రహ్మగా బిరుదు పొందారు. ఆయన గత 50 సం॥ పైగా నిత్య అగ్నిహోత్రావధానం చేసి ఆర్యపురోహిత సభ బొంబాయి వారు ఆర్య పురోహిత బిరుదుతో 2015లో సత్కరించారు. 2016లో అమెరికా వారు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌పై గెస్ట్‌ లెక్చర్‌ కొరకు ఆహ్వానించి సేమ పొందారు. తొగు రాష్ట్రాలో చాలా మంది ఔత్సాహికుకు వైదిక సంస్కారాని జరిపించారు. సత్యార్ధ ప్రకాశ ట్రస్టుని స్థాపించి దయానంద మహర్షి ఆశయాను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దర్శనాచార్యు పండిత గోపదేవ శాస్త్రి గారి శిష్యరికంతో పు ప్రాంతాల్లో వైదీక సిద్ధాంతా ప్రచారం గావించారు. రామ్‌దేవ్‌ బాబా స్థాపించిన పతంజలి ట్రస్టు ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అధ్యక్షుగా ఎనలేని సేమ అందించారు. శాకాహారాన్ని విరివిగా ప్రోత్సహించారు.
డా॥ తిరుమరావు తన మేనకోడలైన సూర్యకుమారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతుకు ఇద్దరు కుమాయి. గోపాకృష్ణ, రవీంద్రనాథ్‌ మరియు ఒక కుమార్తె పద్మజ. గోపాల్‌కు అరుణకుమారితో 1989లో వివాహం జరిపించగా వీరికి ఒక కుమారుడు (జయవర్మ) జన్మించాడు. గోపాల్‌ తమ గ్రామంలో వున్న వ్యవసాయాన్ని చూసుకుంటూ వుండగా చిన్న వయసులోనే హఠాన్మరణం చెందగా ఆ దుఃఖాన్ని తమలోనే దిగమింగుకుని అతని కుమారుడు జయవర్మకు బియస్‌ కంప్యూటర్‌ విద్య నేర్పించి అతని భవిష్యత్తుకు బాట వేశారు. జయవర్మ డా॥ కెకెఆర్‌ సంస్థలో గత 3 సంవత్సరాు విధు నిర్వహిస్తున్నాడు. డా॥ తిరుమరావుగారి రెండవ కుమారుడు రవీంద్రనాథ్‌కు తెనాలికి చెందిన సుధారాణితో 1991లో ఆర్య సమాజ్‌ సిద్ధాంతా ప్రకారం వివాహం జరిపించారు. ఈ దంపతుకు ఇద్దరు కుమాయి. ప్రభాకర్‌, ధృవ. ప్రభాకర్‌ నానో టెక్నాజీలో యం.టెక్‌ చేసి పిహెచ్‌డి చేస్తుండగా, ధృవ మెడిసిన్‌ చదువుతున్నాడు. డా॥ రవీంద్రనాధ్‌ కూడా తన తండ్రి బాటలోనే వ్యవసాయ శాస్త్రంలో యమ్‌.యస్‌.డి., పి.హెచ్‌.డి చేసి యూనియన్‌ బ్యాంకులో వ్యవసాయాధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తన క్రమశిక్షణ, నియమపాన, నిబద్ధత మూంగా అనేక పదువు నిర్వహించి, మంచి పరిపానాధక్షునిగా అదే బ్యాంకులో డిప్యూటీ జనరల్‌ మేనేజనర్‌గా మే 31, 2020న బెంగుళూరు కార్యాయంలో పవీ విరమణ అయినారు. పద్మజను గద్దె వేణుగోపాల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె దివ్యశ్రీ.
డా॥ తిరుమరావు పట్టుద క్రమశిక్షణతో అనేక పదోన్నతు పొంది అదే విశ్వవిద్యాయంలో ప్రధానాచార్యునిగా అనేక మంది విద్యార్థుకు, పి.హెచ్‌.డి విద్యార్థుకు మార్గదర్శి. (గైడ్‌) గా వుంటూ, గుంటూరు వద్ద వున్న లాం వ్యవసాయ ఫామ్‌లో ఆచార్యునిగా, తను చదువుకున్న బాపట్ల వ్యవసాయ కళాశాలో ఆచార్యునిగా, ప్రిన్సిపాల్‌గా 40 సంవత్సరాు పదవు నిర్వహించి, ఆ పదవుకే వన్నె తెచ్చి 1997లో పదవీ విరమణ చేశారు.
పదవీ విరమణ చేసిన తరువాత విశ్రాంత జీవితం గడపటానికి ఇష్టపడక వ్యవసాయ శాస్త్రంలో తన సుదీర్ఘమైన అనుభవాల్ని రైతుకు పంచి పెట్టానే సదుద్దేశ్యంతో ప్రకృతి వ్యవసాయంలో రైతుకు మెకువు నేర్పాని, ఆ వ్యవసాయంపై రైతుకు అవగాహన కల్పించానే నిర్ణయానికి వచ్చి గుంటూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన వినుకొండకు దగ్గరలో వున్న కొచ్చెర్ల అనే గ్రామంలో వ్యవసాయ భూమి కొని దానిని అనేక ఫ, పుష్పాదు వనంగా చేసి ఆ వనంలో వున్న చిన్న భవనంలో తన కుటుంబంతో నివశిస్తున్నాడు. ఈ దంపతు ఆర్యసమాజ్‌ సిద్ధాంతాకు ఆకర్షితులై దయానంద ఆశ్రమాన్ని స్థాపించి ఆ సిద్ధాంతా ప్రకారమే తమ శేష జీవితాన్ని గడుపుతూ ఊరికి దూరంగా ఉన్న ఆ ఆశ్రమంలో గ్రామస్థుకు యోగాసనాు, ఆరోగ్య సూత్రాు గురించి అవగాహన కల్పిస్తూ ఆ చుట్టు పక్క రైతుకు తలో నాుకలాగా, ప్రీతి పాత్రులైనారు. డా. తిరుమరావు 1976లో పతంజలి ఇంటర్నేషనల్‌ యోగా ఇనిస్టిట్యూట్‌ను స్థాపించి యోగాను, యజ్ఞాన్ని ప్రజకు అందుబాటులోకి తెచ్చారు.
డా॥ తిరుమరావు వర్షాభావ పరిస్థితులో రైతు కోరిక మేరకు ఆ గ్రామాలో యజ్ఞం నిర్వహించి, యజ్ఞం ముగిసే సమయానికి భారీ వర్షం కురిపించే వారట. నిజామాబాద్‌ మరియు ఇతర ప్రాంతాలో యజ్ఞం ద్వారా వర్షాు కురిపించి ఆ ప్రాంత రైతు మన్ననను పొందారు. ఆర్య సమాజ్‌ వారు వీరి సేవను గుర్తించి వీరికి ‘‘ఆర్యపురుష’’ అనే బిరుదును ప్రధానం చేసి వీరిని గౌరవించారు. వీరు ఆర్య సమాజ్‌ సిద్ధాంతా కనుగుణంగా అనేక వివాహాు జరిపించారు. వీరిని ‘‘ఆర్యపురోహిత్‌’’ బిరుదుతో సన్మానించారు.
డా॥ తిరుమరావు స్థిత ప్రజ్ఞు, నిగర్వి, అజాత శత్రువు, రైతుమిత్ర. వీరు ఎంత ఉన్నత పదవిలో వున్నా త్లెని పంచెకట్టులోనే వుండేవారు. వీరు తమ జీవితాన్ని నియమ నిష్టతోను, కఠోర పరిశ్రమతోను చివరి వరకు కొనసాగించారు. వీరు ఢల్లీిలో డిసెంబరు ` జనవరి నెల్లో కూడా చన్నీళ్ళ స్నానమే చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేవారు. వీరు రైతు సమస్యు తీరుస్తూ వారికి వ్యవసాయంలో ఎన్నో మెకుమ నేర్పించి వారి మన్ననకు పాత్రులైనారు. వారు ఆచార్యుగా వుండగా కూడా విశ్వవిద్యాయానికి సైకిు మీదనే ప్రయాణం చేసేవారట.
వీరి అంత్యక్రియు (అంత్యేషిు) వీరి కుమారుడు తమ స్వగ్రామంలో జులై 1న వైదిక సిద్ధాంతా ప్రకారం మరియు వీరి పెద్ద కర్మ జులై 12న నిర్వహించారు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త ఆత్మకు స్వర్గలోకప్రాప్తి కగాని కోరుకుందాం.
` కొసరాజు వెంకటేశ్వరరావు
ఫోన్‌ : 9490 63 6659

Share: