కమ్మ మహాజన సంఘంను 11.1.1919 సంవత్సరం మద్రాసు ప్రెసిడెన్సీ, తిరున మేసి జల్లా కోవిలపట్టి నందు కమ్మ వంశంలో ముఖ్యులైన ్గaఎఱఅసaతీ శీట ఖబతీబఙఱసబశ్రీaఎ, నవతీఱషaఅవఅ్aశ్రీ aఅస ూవశ్రీఙaశ్రీజూa్్వకి చెందిన శ్రీమాన్ నారాయణ స్వామినాయుడు మరియు కావడిపట్టి సుబ్బనాయుడు కృషి ఫలితంగా ఆవిర్భవించింది.
మొదటి కమ్మ మహాజన సంఘమునకు :
అధ్యక్షులు : శ్రీమాన్ బెల్లం సుబ్బనాయుడుగారు సెల్వంపట్టి జమిందార్
కార్యదర్శి : పి.ఎన్. కొండల నారాయణ స్వామి నాయుడు గారు, కురువికులం జమిందార్
ఉపాధ్యక్షులు : రావెళ్ళ వెంకట అప్పస్వామి నాయుడు గారు, ఇళయరనందల్ జమిందార్
సహాయ కార్యదర్శి : వి.ఎస్. సుబ్బానాయుడు గారు, వెల్లయపురం
కోశాధికారి : టి.ఎన్. నారాయణస్వామి నాయుడు గారు, దేవరకులం గ్రామం
గౌరవ మేనేజర్ : కె. అలగిరి స్వామి – కృష్ణాపురం గ్రామం. కోవిల్పట్టి కేంద్ర స్థానంగా స్థాపించారు.
మధురై, రామనాధపురం, తిరునన్వేలి జిల్లాలోని 563 గ్రామాలలో నివాసం చేసే కమ్మవారులోని ప్రముఖులను సంఘ సభ్యులుగా చేర్పించినారు.
కమ్మ మహాజన సంఘం మొదటి సమావేశం 1920 ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో కోవిల్ పట్టి నందు జరిగినది. నేటికి 96 సం॥ లు అయినది స్థాపించి. ఆ మహాసభ సమావేశంలో 14 తీర్మానాలు చేశారు. ఆ మొదటి సమావేశంలో బ్రిటీష్ వారిపై విశ్వాసాన్ని ప్రకటించారు. రెండవ తీర్మానంలో వెలగపూడి రామకృష్ణ వీ.A, దీ.ూష గుంటూరు జిల్లా వారిని I.జ.ూ ట్రైనింగ్ కొరకు లండన్ పంపుట వలన బ్రిటిష్ గవర్నమెంటు వారికి ధన్యవాదాలు తెల్పారు.
మూడవ తీర్మానంలో గ్రామాభివృద్ధి, ప్రతివారు మాతృభాషను విధిగా నేర్చుకోవాలని, వ్యవసాయాభివృద్ధి, పండిన పంటలు గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధానంకు కృషి చేయాలని తీర్మానించారు.
కమ్మ మహాసభ రెండవ సమావేశం ` 1921 మేనెల 2,3 తేదీలలో సాత్తూరులో చిత్తూరుకు చెందిన బొల్లిని మునుస్వామినాయుడు ప్రధానమంత్రి మద్రాసు ప్రెసిడెన్సీ గారి అధ్యక్షతన జరిగిన సభను రామనాథపురం కలక్టరు శ్రీ ఎస్.వి. రామమూర్తి వీ.A, I.జ.ూ గారిచే ప్రారంభించ బడినది.
ఆ సభ తీర్మానాలలో గ్రామాభివృద్ధి కొరకు కమ్మవారి బ్యాంకు స్థాపించాలని ఆబ్యాంకు శ్రీ రాజగోపాల్ బ్యాంకుగా ప్రారంభించుటకు కోవిల్ పట్టి అనువైన ప్రాంతంగా నిర్ణయించి 10-7-1920సం॥ లో రైతులందరిని ఈ బ్యాంకులో డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పండిరచిన పంటల అమ్మకాల ద్వారా లభించిన మార్కెట్ పన్ను జమ చేయాలని వర్తకులకు విజ్ఞప్తి చేశారు.
కమ్మ వారి కోసం విద్యావ్యాప్తి చేయాలని అనేక విద్యా సంస్థలు నెలకొల్పి, వారికి హాస్టల్ సౌకర్యాలు కలుగచేసి కోవిల్ పట్టి, పాలయాల కొట్టయి (తిరునన్వేలి) ప్రాంత విద్యార్థులకు నివాస, భోజన సదుపాయం చేయాలని దాతల నుండి ఆర్థిక సహాయం ప్రజల నుండి కూడా పిల్లల ఉన్నత విద్యలభ్యసించుటకు సౌకర్యం పెంపొందించాలని సంఘం ద్వారా విజ్ఞప్తి చేశారు.
సంఘం రైతుల కొరకు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు మార్కెట్లు నిర్మాణం చేయుటకు కావలసిన భూములను కొనుగోలు చేయుట వివిధ ప్రాంతాలు సొత్తూరు, శివకాశి, కోవిల్పట్టి, నాగలాపురం మరియు కలుగుమలైలలో నిర్మించి ఇవి రైతుల సమావేశాలకు వ్యాపారమునకు ఉత్పత్తి దారులకు సౌకర్యములు కొరకు పశువుల కొరకు అభివృద్ధిపరచి మిర్చి, ప్రత్తి, మార్కెట్ చేయుటకు నిర్ణయించారు.
కమ్మ మహాజన సంఘం 1954 వరకు విజయవంతంగా నిర్వహించారు. వాసిరెడ్డి రామస్వానాయుడు వీ.A, దీ.ూ, వీ.ూ.A అధ్యక్షులుగా ఉన్నంతవరకు ప్రజలచే కమ్మవారి మన్నలను పొందగలిగింది.
క్రమంగా సంఘ నిర్వహణ అనుకున్న స్థాయిలో నిర్వహించుట లేదు. కమ్మవారి బ్యాంకు నందు తగిన డిపాజిట్లు రాక కొంతమంది చేతులలో ఫైనాన్సు బ్యాంకుగా మారింది. స్థాపించిన విద్యా సంస్థలు స్థానిక ప్రజలు, కమ్మవారు నిర్వహించుచున్నారు.
కమ్మ మహాజన సంఘం స్థాపించిన వివిధ సంస్థలు :
1. కళ్యాణ మండపం, వ్యాపార కేంద్ర భవనం – సాత్తూరు
2. భవనం మరియు 6 ఎకరాల భూమిగల మార్కెట్ – సాత్తూరు
3. డిగ్రీ కళాశాల సంఘంచే ప్రారంభించినది – సాత్తూరు
4. కోవిల్పట్టి నందు ఉన్నత పాఠశాల
5. ధర్మసత్రం మరియు హైయ్యర్ సెకండరీ స్కూలు ` కలుగుమలై
6. వారం వారం జరిగే సంత కొరకు ఖాళీ భూమి – నాగలాపురం
కమ్మ మహాజన సంఘం స్థాపించిన సంఘములన్నియు, ప్రతి పట్టణములో స్థానిక కమ్మవారు సంఘములుగా ఏర్పడి, సాత్తూరు, శివకాశి, కోవిలపట్టి, కలుగుమలై మరియు అరుప్ప కొట్టయ్లలో నిర్వహించు చున్నారు.
` తుమ్మల వెంకటేశ్వరరావు (సెల్: 98488 75188)
రచించిన ‘తమిళనాడు కమ్మవారు’ పుస్తక సౌజన్యంతో
దక్షిణ కమ్మ మహాజన సంఘం కోవిల్ పట్టి – తమిళనాడు
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021