నాట్కో లాభంలో 22శాతం క్షీణత

N1

50శాతం మధ్యంతర డివిడెండ్‌

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నాట్కో ఫార్మా రూ.93.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.120.4 కోట్లతో పోలిస్తే 22 శాతం క్షీణించింది. నికర ఆదా యం కూడా రూ.486.7 కోట్ల నుంచి రూ.477.2 కోట్లకు తగ్గింది. మొత్తం ఏడాదికి కూడా లాభం 29 శాతం తగ్గి రూ.642.4 కోట్ల నుంచి రూ.458.1 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. 2020, మార్చితో ముగిసిన ఏడాదికి కంపెనీ రూ.2,022 కోట్ల మొత్తం ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఆదాయం, లాభం తగ్గడానికి హెపటైటిస్‌ సీ ఉత్పత్తులు, కేన్సర్‌ ఔషధాలపై ధరల ఒత్తిడే ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా నాలుగో త్రైమాసికంలో సరఫరా వ్యవస్థ అవరోధాలు కూడా కంపెనీ పనితీరుపై ప్రభావాన్ని చూపాయి.

ఫలితాలు ఆశాజనకంగా లేనప్పటికీ.. వాటాదారులకు రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (50ు) నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. దీంతో మొత్తం ఏడాదికి రూ.2 షేరుపై రూ.6.75 డివిడెండ్‌ను చెల్లించినట్లవుతుంది. నాట్కో ఫార్మా షేరు ధర బుధవారం బీఎ్‌సఈలో 4.04 శాతం తగ్గి రూ.613.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో 4 శాతం నష్టపోయింది. రూ.614 వద్ద క్లోజైంది.

Share: