ఈ ప్రపంచంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు బోల్డన్ని వేరియంట్లు వెలుగుచూశాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైనదిగా చెబుతున్న ‘డెల్టా’ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. గతంలో వెలుగుచూసిన అన్ని వేరియంట్ల కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడమే కాక, ప్రమాదకరమైది కూడా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పటి వరకు ఆల్ఫా, గామా వేరియంట్లే ప్రమాదకరమైనవిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు డెల్టా వేరియంట్‌ను ప్రమాదకరంగా చెబుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా వరకు దేశాలు లాక్‌డౌన్‌ను ఆంక్షలను సడలించగా, డెల్టా వేరియంట్ దెబ్బకు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి.
ఈ సంగతి ఇలా ఉంచితే తాజాగా ‘లంబ్డా’ అనే కొత్త వేరియంట్ బ్రిటన్‌లో కనపడినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తెలిపింది. గత వారం యూకేలో 99 శాతం కోవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నాయి. తాజాగా ‘లంబ్డా’ వేరియంట్‌కు చెందిన 6 కేసులు కనుగొన్నట్టు పీహెచ్ఈ పేర్కొంది. వీటిలో ఐదు ఓవర్సీస్ ట్రావెల్‌తో ముడిపడినట్టు చెబుతోంది. కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని తెలిపింది. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి తాజా వేరియంట్ కారణంగా ఆసుపత్రిపాలు కాకుండా రక్షణ ఉంటుందనే అభిప్రాయాన్ని పీహెచ్ఈ వ్యక్తం చేసింది. దీనిపై ఇతమిత్థంగా ఒక అభిప్రాయానికి రావడానికి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, లంబ్డా వేరియంట్‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై తక్కువ ప్రభావం చూపుతుందా అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
గ్రీక్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఆధారంగా కొత్త వేరియంట్లకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) పేర్లు పెడుతుంటుంది. లంబ్డా వేరియంట్‌ను తొలుత 2020 ఆగస్టులో పెరులో కనుగొన్నామని, అప్పటి నుంచి ప్రంపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో కనిపించిందని, ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ సహా లాటిన్ అమెరికాలో కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ వీక్లీ బులెటిన్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు పెరూలో నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం లంబ్డా వేరియంట్ కేసులున్నాయని, చిలీలో గత 60 రోజుల్లో నమోదైన కేసుల్లో 32 కేసుల్లో లంబ్లా వేరియంట్ కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ప్రపంచంపైకి మరో కొత్త వేరియంట్.. లంబ్డా
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021