తెంగాణలోని నిజామాబాద్‌లో ఎంతోమంది కమ్మ వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. అయితే, నేత్ర వైద్యులు మాత్రం అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ పచ్చవ లక్ష్మయ్య చౌదరి-ఝాన్సీబాల దంపతుల కుమారుడు డాక్టర్ పచ్చవ కిరణ్. వైద్య సేవలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ డాక్టర్ లక్ష్మయ్య చౌదరి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఇక డాక్టర్ ఝాన్సీబాల నిజామాబాద్‌లో మొట్టమొదటి గైనకాలజిస్టుగా రికార్డులకెక్కారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ తరపున ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించి స్త్రీలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. డాక్టర్ లక్ష్మయ్య చౌదరి- డాక్టర్ ఝాన్సీబాల దంపతులకు కుమారుడు డాక్టర్ కిరణ్, డాక్టర్ శ్రీదుర్గ అనే కుమార్తె ఉన్నారు.
1972లో జన్మించిన కిరణ్ విద్యాభ్యాసం నిజామాబాద్, విజయవాడ, దావణగెరె (కర్ణాటక)లలో సాగింది. 1996లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన కిరణ్ 2000వ సంవత్సరంలో చిదంబరం (తమిళనాడు)లోని రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేశారు. మద్రాసు విశ్వవిద్యాయంలో హాస్పిటల్ మేనేజ్మెంట్లో డిప్లోమా చేసి, కోయంబత్తూరులోని శంకర కంటి ఆసుపత్రిలో ఫెలోషిప్ చేశారు. అనంతరం కృష్ణన్ కోయిల్‌లోని శంకర కంటి ఆసుపత్రిలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ పనిచేస్తుండగా రెండేళ్ల తర్వాత నైజీరియా నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి ఐఎండీ విజన్ సెంటర్లో ఆప్తమాలజీ శాఖాధిపతిగా ఉద్యోగంలో చేరారు. అక్కడి ప్రభుత్వ సహకారంతో అనేక కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. మొత్తంగా 2500కుపైగా ఆపరేషన్లు నిర్వహించారు. స్థానిక వైద్యులకు కంటి ఆపరేషన్లలో అవగాహన కల్పించారు.
2006లో నైజీరియా నుంచి భారత్ తిరిగి వచ్చిన డాక్టర్ కిరణ్ గుంటూరులోని శంకర నేత్రాయంలో ప్రధాన మెడికల్ అధికారిగా విధుల్లో చేరారు. ఆ ఆసుపత్రిలో ఔట్ పేషంట్ విభాగాన్ని మెరుగుపరిచి ఒక్కరోజులో 104 కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి రికార్డును నెకొల్పారు. ఆ తరువాత వాసన్ ఐ కేర్ ఆసుపత్రిలో మెడికల్ డైరెక్టర్‌గా చేరారు. తెలంగాణలో ఉన్న వాసన్ కంటి ఆసుపత్రులలో ఉన్న నేత్ర వైద్యులకు కంటి ఆపరేషన్లు నిర్వహించే విధానంలో అనేక మెలకువలు నేర్పారు.
కంటి ఆపరేషన్ల నిర్వహణలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న డాక్టర్ కిరణ్ 2016లో హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో డాక్టర్ కిరణ్ ఐ ఆసుపత్రిని అత్యాధునిక హంగులతో స్థాపించారు. భార్య ప్రియాంకతో కలిసి ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా గోవాడకు చెందిన ఉప్ప వెంకట్రామయ్య-అరుణ్ కుమార్ దంపతుల కుమార్తే ప్రియాంక. 2013లో డాక్టర్ కిరణ్-ప్రియాంక వివాహం జరిగింది. బయోటెక్నాలజీలో ఎంఎస్ చేసిన ప్రియాంక ఆ తర్వాత ఎంబీయే కూడా పూర్తి చేశారు. అనంతరం కొంతకాలంపాటు ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి వ్యవహరాలను చూసుకుంటున్నారు. డాక్టర్ కిరణ్-ప్రియాంక దంపతులకు రెండో తరగతి చదువుతున్న కుమార్తె బేబీ తన్వి ఉంది. డాక్టర్ కిరణ్ తన 20 వృత్తి జీవితంలో లక్ష కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో 70 వేలు కంటి శుక్లాల ఆపరేషన్లు కాగా, 30 వేల రెఫ్రాక్టివ్ సర్జీలు ఉన్నాయి. తెలంగాణలోని మరిన్ని ప్రాంతాల్లో అత్యాధునిక హంగులతో కంటి ఆసుపత్రులు స్థాపించి మరింత మందిలో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్న డాక్టర్ కిరణ్ ఆశయం నెరవాలని కోరుకుందాం.
డాక్టర్ ఝాన్సీబాల కుటుంబం గురించి..
డాక్టర్ కిరణ్ తల్లి డాక్టర్ ఝాన్సీబాల తల్లిదండ్రులు దుర్గాంబ-మన్నవ కుటుంబరావు. వీరిది గుంటూరు జిల్లాలోని అమర్తలూరు గ్రామం. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తితో తమ కుమార్తెలకు ఝానీ అని కలిసి వచ్చేలా పేర్లు పెట్టడం విశేషం. వీరి పేర్లు ఝాన్సీలక్ష్మి, ఝాన్సీవాణి, ఝాన్షీవేణి, ఝాన్సీమణి, ఝాన్సీదేవి, ఝాన్సీబాల కాగా, కుమారుడి పేరు డాక్టర్ జయసింహ.
డాక్టర్ ఝాన్సీబాల తోబుట్టువులందరూ గైనకాలజిస్టులు కావడం విశేషం. ఝాన్సీబాల తండ్రి కుటుంబరావు సాధారణ రైతు అయినా విద్య గొప్పతనం తెలిసి అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న వీరందరూ వైద్యులుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. డాక్టర్ కిరణ్ తాతలిద్దరూ (అమ్మ తండ్రి.. నాన్నతండ్రి) స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. కుటుంబరావు కుటుంబంలో 45 మంది వైద్యులు ఉండడం గమనార్హం.
డాక్టర్ శ్రీదుర్గ గురించి..
డాక్టర్ కిరణ్ సోదరి శ్రీదుర్గ హైదరాబాద్‌లోని స్వప్న హెల్త్‌కేర్‌లో ఐవీఎఫ్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. దుర్గ భర్త డాక్టర్ అనిల్ హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. దుర్గ- అనిల్ దంపతులకు ఇద్దరు పిల్లలు హర్షిత, ఆదిత్య ఉన్నారు. కుమార్తె హర్షిత అపోలో వైద్య కళాశాలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు ఆదిత్య 8వ తరగతి చదువుచున్నాడు.
ఫోన్: 97040 33444
సేకరణ: కొసరాజు వెంకటేశ్వరరావు
94906 36652