స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు

ps

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు
రాష్ట్రపతి చేతుల మీదగా సత్కారం పొందుతున్న పావులూరి శివరామకృష్ణయ్య
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య(98) కన్నుమూశారు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. అమర్తలూరు మండలం గోవాడలో ఆయన జన్మించారు. ప్రాథమిక విద్య గోవాడలో, ఉన్నతవిద్య తీరుమెళ్ల, మెట్రిక్యులేషన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గాంధీ ఆశయాలకు ఆయన ప్రభావితుడయ్యారు. వార్దా సేవాగ్రామ్‌లో 1934లో ఏడాది పాటు గాంధీకి సేవలందించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అలీపూర్‌ జైలులో కారాగార శిక్ష అనుభించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథకోవింద్‌ చేతుల మీదుగా 2018లో విశ్వహిందీ సమ్మేళనంలో భాగంగా విశిష్ట సన్మానం అందుకున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
సాధారణ జీవితానికి నిలువెత్తు నిదర్శనం..
జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి చేరుకున్నా ఆయన చివరివరకు సాధారణ జీవనాన్నే సాగించారు. సాధారణ ప్రజల వలే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు. ఎప్పుడూ ప్రజాసమస్యలపై, వర్తమాన భారతీయ పరిస్థితులపై తన గళం ఏదో రూపంలో వినిపిస్తూనే ఉన్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక రావాలని ఆయన చివరు వరకు ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అలానే మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీ సుజనాచౌదరి, ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, గల్లా అరుణ, డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, పశ్చిమ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఏస్‌ రామకృష్ణ, పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్రనాయుడు, ప్రముఖ వైద్యులు గౌరినేని రమాదేవి తదితరులు సంతాపం తెలియజేశారు.
————————-
కరోనాతో పావులూరి కన్నుమూత
ప్రముఖ సమరయోధుడు, గాంధీజీకి శిష్యుడు
గవర్నర్‌, చంద్రబాబు సంతాపం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మహాత్మాగాంధీ ఆశయాలకు ఆయన ప్రభావితుడయ్యారు. అనంతరం గాంధీజీకి శిష్యుడయ్యారు. తమిళనాడు మాజీ గవర్నర్‌, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, నవ్యాంధ్ర తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆయనవద్ద విద్యనభ్యసించారు. పావులూరి ఏపీ హిందీ అకాడమీ సభ్యుడిగా, ఏపీ పట్టు పరిశ్రమ సలహా సంఘం సభ్యుడిగా, ఏపీ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కావూరు వినయాశ్రమ ధర్మకర్తలమండలి సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. వార్దా సేవాగ్రామ్‌లో 1934లో ఏడాది పాటు గాంధీజీకి సేవలందించారు. క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని అలీపూర్‌ జైలులో కారాగార శిక్ష అనుభించారు. 2018లో విశ్వహిందీ సమ్మేళనంలో భాగంగా రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చేతుల మీదగా విశిష్ట సన్మానం అందుకున్నారు. పావులూరికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రముఖుల సంతాపం
పావులూరి శివరామకృష్ణయ్య మృతికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నేటి తరం యువతకు స్ఫూర్తి ప్రదాత: బాబు
పావులూరి మృతిపట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. నిరంతరం ప్రజాసేవకుడిగా, సంఘ సంస్కర్తగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకున్నారని కొనియాడారు. శివరామకృష్ణయ్య కుమారుడు కృష్ణకుమార్‌తో పాటు కుటుంబసభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాజీ డిప్యూటి స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు తదితరులు కూడా పావులూరి మృతికి సంతాపం ప్రకటించారు.
———————————
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పావులూరి కన్నుమూత
గుంటూరు: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. హిందీ టీచర్‌గా పని చేస్తూ గాంధీ ఆశయాలకు ఆయన ప్రభావితుడయ్యారు. అనంతరం గాంధీ శిష్యరికంలో పని చేశారు. పాలువూరి వద్ద కొణిజేటి రోశయ్య, కోడెల శివ ప్రసాద్ విద్యనభ్యసించారు. పావులూరి మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
——————-
స్వాతి బలరాం కుమార్తె మృతి
ప్రముఖ సంపాదకుడు, పబ్లిషర్ వేమూరి బలరామ్ కుమార్తె మణిచందన (46) మరణించారు. ఏడాది కాలంగా అస్వస్థతతో వున్న ఆమెకు కరోనా సోకి మరణించారని తెలుస్తోంది. అయితే అస్వస్థత కారణంగా గుండెపోటు వచ్చి మరణించారని కూడా వినిపిస్తోంది.
ఆంధ్ర ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ అనిల్ కుమార్ భార్య ఆమె. ఇద్దరు కుమార్తెలు వున్నారు. గత ఏడాది కాలంగా ఆమె కాస్త అస్వస్తతగా వున్నారు.
ఇటీవల కరోనా సోకి, తగ్గింది. బాగానే వున్నారని సమాచారం. కానీ వున్నట్లుండి నిన్న రాత్రి నుంచి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. దాంతో ఈ ఉదయం కన్నుమూసారు. వేమూరి బలరామ్ కు ఆమె ఒక్కరే కుమార్తే. ఆమెకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. మణిచందన్ స్వాతి మెనేజింగ్ ఎడిటర్ గా వున్నారు.

ps1

Share: