శతాధిక కమ్యూనిస్టు నేత వీరపనేని రామదాసు శతజయంతి సందర్భంగా ప్రసంగం
‘‘కమ్యూనిస్టు సిద్ధాంతాు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి… కానీ వాటిని అము చేయడంలో ప్రస్తుత నాయకు తీరే మారుతోంది’’ అంటూ శతాధిక వృద్ధుడు, కమ్యూనిస్టు యోధుడు వీరపనేని రామదాసు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఏపీ, తెంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తనకంటూ చరిత్రలో స్థానం సంపాదించుకున్న రామదాసు 101 ఏళ్లు వయస్సులోనూ గత అనుభవాను, ప్రస్తుత పరిస్థితిని కుండబద్దుకొట్టినట్టు వివరించారు.
నేను చదివింది మూడవ తరగతి. కాని జీవితం చాలా పాఠాు నేర్పింది. నా చుట్టూ ఉన్న సమాజంలో పేదు, బాధితు పక్షాన నిలిబడి అనేక పోరాటాు చేశాను. గన్నవరం తాూకా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా నేను పనిచేసిన కాంలోనే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చపల్లి సుందరయ్య ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయన గొపుకోసం నియోజకవర్గం అంతా రోజు తరబడి కాలినడక పర్యటించిన సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. గన్నవరం ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన దగ్గర్నుంచి సుందరయ్య నన్ను ఎంతగానో అభిమానించి ఉద్యమాల్లో ప్రోత్సహించారు.
సుందరయ్యతోపాటు నండూరి ప్రసాదరావు, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్ రెడ్డి), కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, నెక్కపూడి రామారావు, మైవరపు రామారావు వంటి కాకు తీరిన కమ్యూనిస్టు నేతతో కలిసి ఉద్యమాల్లో పాుపంచుకునే అవకాశం దక్కింది. చాలా సందర్భాల్లో బ్రిటీష్ పోలీసు, అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసు నా ఆచూకీ కోసం నా భార్య వెంకట సుబ్బమ్మను వేధించినప్పటికీ ఆమె నాకు అందించిన సహకారం మరిచిపోలేను. నా కుమార్తెకు విశాలాంధ్ర (స్వర్ణకుమారి), కుమారుకు డాంగే, కృశ్చేవ్ పేర్లు పెట్టుకున్నాను. నా పెద్ద కొడుకు రామారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
జైులో మూడేళ్లు..
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న నన్ను బ్రిటీష్ పోలీసు అరెస్టు చేసి మూడేళ్ల పాటు జైల్లో పెట్టారు. బళ్లారి జైులో అక్కడ పురుగు అన్నం, న్లుతో పడిన ఇబ్బందును నా జీవితంలో మరిచిపోలేను. అన్ని కష్టాు పడి కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగాను. అయినప్పటికీ గన్నవరం ప్రాంతంలో సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఎన్నిక సమయంలో కొందరు నాయకు తీరువ్ల తీవ్ర మనస్తాపంతో ఉద్యమానికి దూరం కావాని తెంగాణలోని వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు వస వెళ్లిపోయాను. నేను ఎక్కడ ఉన్నానో తొకుని అక్కడికి వచ్చిన సుందరయ్య తిరిగి గన్నవరం రావాని కోరినా నేను సున్నితంగా తిరస్కరించాను.
అయితే వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమం కోసం పనిచేయాని సుందరయ్య కోరారు. అంత గొప్ప నాయకుడి కోరికను కాదనలేక అక్కడ రైతు, కూలీ ఉద్యమాు నిర్మించాను. అప్పట్లో నాతో పాటు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి నక్సలిజంలోకి వెళ్లిన కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, కేజీ సత్యమూర్తి వంటి వారి అచూకీ కోసం పోలీసు నన్ను తీవ్రంగా వేధించేవారు. ఒక దశలో పోలీసు నన్ను చంపాని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసి సుందరయ్య కాపాడారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయాని అప్పట్లో కాంగ్రెస్ పాకు నన్ను 14 నెలపాటు జైులో కూడా నిర్బంధించారు.
ఉద్యమ పంథాపై అసంతృప్తి
ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన నాకు అప్పటితరం, ఇప్పటి తరం మధ్య ఉద్యమ పంథా మారిన క్రమం కొంత అసంతృప్తికి గురిచేసింది. అప్పట్లో ఎంత గొప్ప కమ్యూనిస్టు నాయకుడైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు సిద్ధాంతాు కూడా నాయకు తీరుతో మారుతున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాు చాలా గొప్పవి కాని, వాటిని అము చేయడంలోనే ఇప్పటి తరం నాయకు తీరుతో నేను విభేదిస్తుంటాను. అదే విషయాన్ని ఏపీ, తెంగాణ రాష్ట్రాల్లోని సీపీఎం నేతు నన్ను కలిసినప్పుడు ఉద్యమ పంథాలో వారు అనుసరిస్తున్న వ్యక్తిగత పోకడను ప్రస్తావించి మనసులోని వేదనను వెళ్లగక్కుతుంటాను. ఏదిఏమైనా నా చివరి శ్వాసవరకు కమ్యూనిస్టుగానే ఉంటాను అంటూ రామదాసు చెప్పుకొచ్చారు.